వాట్సాప్ లో మెసేజ్ బాంబులు.. జాగ్రత్త

వాట్సాప్ లో మెసేజ్ బాంబులు.. జాగ్రత్త

ప్రముఖ మొబైల్ మెసేజింగ్ యాప్.. వాట్సాప్ వినియోగించనివారు ఈ రోజుల్లో చాలా అరుదు. నిత్యం కొన్ని కోట్ల మంది కొన్ని కోట్ల మెసేజ్‌లను ఫార్వార్డ్ చేసుకుంటుంటారు. వాటిల్లో ఫన్నీ మెసేజ్‌లు, ఫొటోలు, వీడియోలే అధిక సంఖ్యలో ఉంటాయి. ఇలాంటి మెసేజ్‌ల పట్లే యూజర్లు ఎక్కువగా ఆసక్తిని చూపిస్తారు. అయితే ఇదే విషయాన్ని ఆసరగా చేసుకుని కొందరు ఇప్పుడు వాట్సాప్‌లో మెసేజ్ బాంబులను పంపుతున్నారు. అంటే ఆ మెసేజ్‌లు చూసేందుకు పైన చెప్పినట్లుగా ఫన్నీ తరహాలో ఉంటాయి. కానీ ఓపెన్ చేస్తే యూజర్ల ఫోన్లు హ్యాంగ్ అయి పనిచేయకుండా పోతాయి. వాట్సాప్‌లో ప్రస్తుతం ఈ తరహా మెసేజ్‌లు రెండు ఎక్కువగా ఫార్వార్డ్ అవుతున్నాయి. అవేమిటంటే...

వాట్సాప్‌లో ప్రస్తుతం ఫార్వార్డ్ అవుతున్న రెండు మెసేజ్ బాంబుల్లో ఒకటి.. t-touch here.. ఇందులో ఈ మెసేజ్ పక్కనే నల్లని చుక్క ఉంటుంది. అది బంతి ఎమోజీని పోలి ఉంటుంది. దాన్ని టచ్ చేస్తే అంతే సంగతులు.. వాట్సాప్ క్రాష్ అవుతుంది. ఇక మరో మెసేజ్‌లో.. this is very interesting.. అని ఉంటుంది. పక్కనే ఓ ఎమోజీతోపాటు read more.. అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేయగానే వాట్సాప్‌తోపాటు ఫోన్ కూడా క్రాష్ అవుతుంది. ఈ క్రమంలో పాత ఆండ్రాయిడ్ ఫోన్లు అయితే అవి పూర్తిగా పనిచేయకుండా పోతున్నాయని పలువురు వెల్లడిస్తున్నారు. అయితే ఈ మెసేజ్ లు పైకి సాధార‌ణ మెసేజ్ ల‌లాగే అనిపించినా.. వాటిలో మ‌న‌కు క‌నిపించ‌ని ఇన్విజిబుల్ క్యారెక్ట‌ర్ల‌ను ఫిక్స్ చేయ‌డం వ‌ల్ల ఆ మెసేజ్‌ల‌ను ఓపెన్ చేయ‌గానే యాప్ లేదా ఫోన్ హ్యాంగ్ అవుతున్న‌ట్లు నిర్దారించారు. కనుక ఈ రెండు మెసేజ్‌లలో ఏ తరహా మెసేజ్ వచ్చినా ఓపెన్ చేయవద్దని సెక్యూరిటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM NEWS

Next page