Asianet News TeluguAsianet News Telugu

వాట్సాప్ లో సరికొత్త ఫీచర్..

జస్ట్.. వాట్సాప్ అప్ డేట్ చేసుకుంటే చాలు
WhatsApp rolls out new features for those changing numbers

ప్రముఖ మెసేజింగ్ యాప్.. వాట్సాప్ లో మరో సరికొత్త ఫీచర్ వచ్చింది. వినియోగదారులను ఆకట్టుకునేందుకు, వారి సౌలభ్యం కోసం వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకువస్తూనే ఉంది. తాజాగా మరో అదిరిపోయే ఫీచర్ ని తీసుకువచ్చింది. ఆండ్రాయిడ్, యాపిల్ యూజర్లు కేవలం అప్ డేట్ వర్షన్ వాట్సాప్ ని డౌన్ లోడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ అద్భుతమైన ఫీచర్ మీకు అందుబాటులోకి వస్తుంది.

యాపిల్‌ యూజర్లు స్టేటస్‌ అప్‌డేట్స్‌ని కొత్త పద్ధతిలో చూడొచ్చు. వాయిస్‌ మెసేజ్‌లనూ మరింత అనువుగా ప్లే చేసుకునే విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఫోన్‌ స్క్రీన్‌ ఆఫ్‌ చేసినా... వేరే ఆప్‌లోకి మారినా వాయిస్‌ మెసేజ్‌లు ప్లే అవుతూనే ఉంటాయి. ఐఓఎస్‌ 7.0, ఆ తర్వాతి వెర్షన్లతో మాత్రమే ఈ ఆప్షన్‌ పని చేస్తుంది.

ఇప్పటికే ఉన్న ‘ఛేంజ్‌ నెంబర్‌’ ఆప్షన్‌కి మరిన్ని ఆప్షన్స్‌ని జత చేసింది. దీంతో కొత్త ఫోన్‌ నెంబర్‌కి మారితే ఆ విషయాన్ని వాట్సాప్‌ నెంబర్లకు చేరవేయొచ్చు. ఆండ్రాయిడ్‌ ఫోన్‌ యూజర్లు ఈ ఆప్షన్‌ని వాడుకోవచ్చు. వాట్సాప్‌ సెట్టింగ్స్‌లోని ఎకౌంట్‌ మెనూలోకి వెళ్తే ‘ఛేంజ్‌ నెంబర్‌’ ఆప్షన్‌ కనిపిస్తుంది. సెలెక్ట్‌ చేసి పాత, కొత్త నెంబర్లను ఎంటర్‌ చేసి అందరికీ అప్‌డేట్‌ చేరేలా చేయవచ్చు. కొందరికి మాత్రమే చెప్పేందుకు ‘కస్టమ్‌’ మెనూ ద్వారా కావాల్సిన కాంటాక్ట్‌లను మాత్రమే సెలెక్ట్‌ చేసుకోవచ్చు.

 

Follow Us:
Download App:
  • android
  • ios