అలా వచ్చి ఇలా మాయమైన  వాట్సాప్ ఫీచర్

WhatsApp Private Reply Feature for Groups Enabled by Mistake
Highlights

  • వాట్సాప్ లో కొత్త ఫీచర్
  • కనిపించిన కాసేపటికే మాయమైన ఫీచర్

ప్రముఖ మెసేజింగ్ యాప్.. వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్ వచ్చింది. కానీ.. ఆ కొత్త ఫీచర్ అలా కనిపించిందో లేదో.. మళ్లీ వెంటనే తీసేసారు. అసలు సంగతేంటంటే.. వాట్సాప్.. త్వరలో ‘ రిప్లై ప్రైవేట్లీ’ కొత్త ఫీచర్ ని అందుబాటులోకి తీసుకురానుంది. కాగా.. దీని బీటా వర్షన్ ని పొరపాటున యాక్టివేట్ చేసింది. ఈ విధానంలో గ్రూపులో ఉంటూనే ఓ సభ్యుడికి గ్రూప్‌ నుంచి ఇతర సభ్యులకు తెలియకుండా సందేశం పంపొచ్చు. వాట్సప్‌ బీటా ఆప్‌డేట్‌లో ఈ ఫీచర్ ని యాక్టివేట్ చేశారు.

విడుదలకి ముందే యాక్టివేట్ అవ్వడాన్ని గమనించి వెంటనే సరిచేశారు. దీంతో ఈ ఫీచర్ కనిపించిన కాసేపటికే మాయమైంది. ప్రస్తుతానికి ఈ ఫీచర్‌ అభివృద్ధి దశలోనే ఉందని, ఇతర ఫీచర్లతో కలిపి రిప్లై ప్రైవేట్ ని విడుదల చేస్తామని కంపెనీ వెల్లడించింది. డెవలపర్లు పొరపాటున దీనిని యాక్టివేట్‌ చేసి ఉంటారని అభిప్రాయపడింది. కాగా, మరికొన్ని రోజుల్లో ఈ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు.

loader