ప్రముఖ మొబైల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్.. ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను మన ముందుకు తీసుకువస్తూనే ఉంది. అయితే.. వాటిలో కొన్ని ఫీచర్లు..వినియోగదారులను వెంటనే ఆకట్టుకుంటున్నాయి. మరికొన్ని పెద్దగా ఉపయోగపడడం లేదు. అయితే.. ప్రతి ఒక్కరికీ ఉపయోగపడే, చాలా మంది ఎంతగానో ఎదురు చూస్తున్న ఫీచర్ ని ఇప్పుడు వాట్సాప్ అందుబాటులోకి తీసుకువస్తోంది.

ఒకరికి పంపాల్సిన మరొకరికి పంపినట్లయితే.. ఆ మెసేజ్ ఫంపిన 7 నిమిషాలలోపు ‘ డిలీట్ ఫర్ ఎవ్రీ వన్’ అనే ఆప్షన్ తో వెనక్కి తీసుకోవచ్చు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే.. 7 నిమిషాలు దాటితే మాత్రం దానిని మనం డిలీట్ చేయలేం. అప్పుడు ఈ ఆప్షన్ పనిచేయదు. కాగా.. ఇప్పుడు ఈ ఆప్షన్ లో వాట్సాప్ మరో మార్పు చేస్తోంది.

వినియోగదారుల కోరిక మేరకు.. 7 నిమిషాల నుంచి 68నిమిషాల16 సెకన్లకు మార్చింది. అంటే.. ఇక నుంచి ఏదైనా మెసేజ్ ని 68 నిమిషాలలోపు డిలీట్ చేసుకునే అవకాశం ఉంది. అతి త్వరలోనే ఈ ఫీచర్.. వాట్సాప్ వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.