వాట్సాప్ లో అతి త్వరలో అద్భుతమైన ఫీచర్ రాబోతోంది. వాట్సాప్ లో మీరు మీ ఫ్రెండ్స్ తో  వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసుకున్న ఫోటోలు, వీడియోలు, టెక్స్ట్ మెసేజ్ లు వంటి డేటా మొత్తం మీకు కావాలనుకున్నప్పుడు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ ని వాట్సాప్ పరిశీలిస్తోంది. కాగా.. ఇలాంటి ఫీచర్ ఇప్పటికే ఫేస్ బుక్ లో అందుబాటులో ఉంది.  

ఫేస్ బుక్ లో ‘‘డౌన్ లోడ్ యువర్ డేటా’’ అనే ఆఫ్షన్ గురించి తెలిసే ఉంటుంది. ఈ ఫీచర్ తో ఇప్పటివరకు మీరు చేసిన పోస్టులు, ఫోటోలు, వీడియోలు మొత్తం కలిపి కంప్రెస్ చేసి ఓ జిప్ ఫైల్‌గా తయారుచేసి అందిస్తుంది. ఇక దాదాపు ఇలాంటి సదుపాయాన్ని వాట్సాప్ కూడా అందించబోతోంది. ఒక్కసారి ఇది అందుబాటులోకి వస్తే వాట్సాప్ యూజర్లు ఎకౌంట్ సెట్టింగ్స్ లో ‘‘ డౌన్ లోడ్ మై డేటా’’ అనే ఆప్షన్ ద్వారా తమ డేటా మొత్తాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. డేటా.. జిఫ్, ఫైల్ ఫార్మాట్ లో ఉంటుంది.

 ‘‘డౌన్ లోడ్ మై డేటా’’ ని క్లిక్ చేయాలి. తర్వాత ‘రిక్వెస్ట్‌ రిపోర్ట్‌’ను ప్రెస్‌ చేయాల్సి ఉంటుంది. తర్వాతి 20 రోజుల్లో సదరు డేటా డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు అందుబాటులోకి వస్తుంది. డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు డేటా రెడీ అయినట్లు ఓ నోటిఫికేషన్‌ సైతం వాట్సాప్‌ పంపిస్తుందట. అప్పటి నుంచి 30 రోజుల్లో ఈ డేటాను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ మే 25 నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.