Asianet News TeluguAsianet News Telugu

వాట్సాప్ లో మరో సరికొత్త ఫీచర్..రికార్డ్ మెసేజ్ లకు లాక్

వాయిస్ మెసేజ్ లు పంపడంలో మార్పు
WhatsApp Beta for Android Now Lets You Lock Voice Message Recording

ప్రముఖ మొబైల్ మెసేజింగ్ యాప్.. వాట్సాప్ ని వినియోగించని వారు చాలా అరుదు. మార్కెట్లోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే.. ఎక్కువ మందికి చేరువైంది. వాట్సాప్ కూడా.. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తూ.. వినియోగదారులను ఆకట్టుకుంటోంది. తాజాగా.. మరో అద్భుతమైన ఫీచర్ ని కూడా తీసుకువచ్చింది. ఇప్పటి వరకు వాట్సాప్ లో మీరు వాయిస్ మెసేజ్ లు పంపే ఉంటారు. ఈ వాయిస్ మెసేజ్ లు పంపడంలో ఓ మార్పు తీసుకువచ్చింది వాట్సాప్.

రికార్డు చేసిన వాయిస్‌ మెసేజ్‌లను లాక్‌ చేసుకునే వెసులుబాటు ఉంది. మెసేజ్‌ రికార్డు చేస్తున్న సేపు రికార్డు బటన్‌ను పట్టుకునే ఉండకుండా.. వాయిస్‌ మెసేజ్‌లను తేలికగా రికార్డు చేయొచ్చు. అంతేకాకుండా రికార్డు చేసిన  వాయిస్‌ మెసేజ్‌లను డెలివరీ చేసేముందే యూజర్లు ప్లే చేసే వినే ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ ఫీచర్‌ కోసం 2.18.102ను వాట్సాప్‌ అప్‌డేట్‌ చేసింది. వాయిస్‌ రికార్డింగ్‌లను లాక్‌ చేసుకునే ఫీచర్‌ను ఐఓఎస్‌ ఐఫోన్లకు గతేడాది నవంబర్‌లోనే తీసుకొచ్చింది. ప్రస్తుతం దీన్ని ఆండ్రాయిడ్‌ బీటా వెర్షన్‌కు కూడా అందుబాటులోకి తెచ్చింది. 

మీ వాయిస్‌ మెసేజ్‌లను లాక్‌ చేయాలనుకుంటే, మిక్‌ ఐకాన్‌ను 0.5 సెకన్లు పట్టుకుని, లాక్‌ బటన్‌ వైపు మీ చేతి వేళ్లను స్లైడ్‌ చేయాలి. ఒక్కసారి లాక్‌ అయిన వాయిస్‌ రికార్డింగ్‌ను తేలికగా సెండ్‌ బటన్‌తో పంపవచ్చు. అంటే మనం ఎవరికైనా వాయిస్ మెసేజ్ లు పంపాలనుకున్నప్పుడు రికార్డు బటన్ మీద అలాగే ప్రెస్ చేసి పట్టుకోవాల్సిన పనిలేకుండా ఒకసారి రికార్డింగ్ లాక్ చేసి పెడితే.. మాట్లాడడం పూర్తయిన తర్వాత దాన్ని అన్లాక్ చేసుకునే విధంగా ఈ లాక్డ్‌ రికార్డింగ్‌ సదుపాయం ఉపయోగపడుతోంది. లాక్‌ రికార్డింగ్‌ ఫీచర్‌, వాయిస్‌ మెసేజ్‌లను పంపే ముందు వినే సౌకర్యం కోసం వాట్సాప్‌ బీటా యూజర్లు ఆండ్రాయిడ్‌ వెర్షన్‌ 2.18.102ను డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది.  

Follow Us:
Download App:
  • android
  • ios