వాట్సాప్ లో మరో సూపర్ ఫీచర్

First Published 21, Feb 2018, 2:46 PM IST
WhatsApp adds new Group Description feature in Android Windows beta app
Highlights
  • వాట్సాప్ లో మరో సరికొత్త ఫీచర్

ప్రముఖ మొబైల్ మెసేజింగ్ యాప్.. వాట్సాప్ మరో సరికొత్త ఫీచర్ ని ప్రవేశపెట్టింది. ఇటీవలే వాట్సాప్ లో పేమెంట్స్ ఫీచర్ ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా కేవలం ఐవోఎస్ యూజర్ల కోసం వాయిస్ కాల్ నుంచి వీడియో కాల్ కి, వీడియో కాల్ నుంచి వాయిస్ కాల్ కి మారే ఫీచర్ ని కూడా తీసుకువచ్చింది. ఇవన్నీ కాకుండా మరో ఫీచర్ ని ఇప్పుడు ప్రవేశపెట్టింది.

వాట్సాప్ గ్రూప్ ల గురించి అందరికీ తెలిసే ఉంటుంది. మీరు ఒక వాట్సాప్ గ్రూప్ లో ఉన్నారనుకోండి. ఆ గ్రూప్ లోకి మీ ఫ్రెండ్స్ ని కూడా చేర్చాలి అనుకుంటే.. ఆ గ్రూప్ లింక్ ని మీ ఫ్రెండ్స్ కి పంపుతారు. అవునా.. వాళ్లు ఆ లింక్ ద్వారా గ్రూప్ లో జాయిన్ అవుతారు. అయితే.. ఆ లింక్ లో గ్రూప్ గురించి ఎలాంటి డీటైల్స్ ఉండవు. అంటే ఆ గ్రూప్ దేని గురించి..? అందులో ఏలాంటి వాళ్లు జాయిన్ అవ్వాలి    లాంటి సమాచారం అనమాట. ఇక నుంచి ఎవరికైనా గ్రూప్ లింక్ షేర్ చేసే సమయంలో  ఆ గ్రూప్ గురించి 500 అక్షరాలు మించకుండా  డిస్క్రిప్షన్ ఇవ్వొచ్చు. తమ ఆండ్రాయిడ్ ఫోన్లలో వాట్సాప్ బీటా 2.18.54 వెర్షన్ వాడుతున్నవారికి ఈ ఆప్షన్ లభిస్తుంది. మిగతా యూజర్లకు అతిత్వరలో అందుబాటులోకి రానుంది.

loader