నూతన ఫీచర్ ను ప్రారంభించిన వాట్సాప్. రంగు రంగుల్లో స్టేటస్ అప్ డేట్ చేసుకోవచ్చు

వాట్సాప్ వినియోగదారుల‌కు గుడ్ న్యూస్‌, ఆండ్రాయిడ్‌, ఐఓఎస్ స్మార్ట్ ఫోన్‌ల‌కు వాట్సాప్‌ కొత్త అప్‌డేట్‌ను ప్ర‌వేశ‌పెట్టింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఫేస్‌బుక్ లో మాత్ర‌మే ఉన్న క‌ల‌ర్ క‌ల‌ర్ స్టేట‌స్ అప్‌డేట్ ను ఇప్పుడు వాట్సాప్ ప్ర‌వేశ‌పెట్టింది.

వాట్సాప్ లో ఇప్ప‌టి వ‌ర‌కు ఫోటో మాత్ర‌మే స్టేట‌స్ గా పెట్టుకోవ‌డానికి అవ‌కాశం ఉంది. కాని న‌చ్చిన ప‌దాల‌ను రాసి స్టేట‌స్‌గా పెట్టుకోవ‌డానికి అవ‌కాశం లేకుండే, కాని నేటి నుండి ఆ స‌దుపాయం కూడా క‌ల్పించింది వాట్సాప్‌, రంగుల్లో రాయ‌డం, బ్యాక్‌గ్రౌండ్‌లో న‌చ్చిన రంగును పెట్టుకునే స‌దుపాయాన్ని వాట్సాప్ కల్పించింది. అలాగే అక్ష‌రాల‌ను వివిధ ఫాంట్ల‌లో రాసుకునే అవ‌కాశాన్ని కూడా అందుబాటులోకి తెచ్చింది. అంతేకాదు స్టేట‌స్‌లో వెబ్ లింక్‌ల‌ను పెట్టుకునే అవ‌కాశం కూడా క‌ల్పించింది.


మరిన్ని తాజా విశేషాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి