నోట్ల సంక్షోభం , ప్రజల అగచాట్ల పేరుతోఢిల్లీ వెళ్లి, ఇళ్లు చక్కబెట్టుకునేందుకు ఖ్యమంత్రి ప్రధానితో కలిశారట

ముఖ్యమంత్రి కెసిఆర్ ఢిల్లీ వెళ్లింది అంతా అనుకున్నట్లు పెద్ద నోట్లు పోయిన చికాకుతో కాదట.

నోట్ల సంక్షోభం , ప్రజల అగచాట్ల పేరుతోఢిల్లీ వెళ్లి, ముఖ్యమంత్రి పార్టీలో తనకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకునేందుకు ప్రధానిసాయం కోరారట. తెలంగాణా కౌన్సిల్ లో ప్రతిపక్షనాయకుడు మహమ్మద్ అలీ షబ్బీర్ ఈ మాట అంటున్నారు.

వచ్చే ఎన్నికల నాటికి అసెంబ్లీ సీట్లు పెరుగుతాయని చెప్పి ఇతర పార్టీల వారిని మంది టిఆర్ఎస్ లో చేర్చుకున్నారు.అసెంబ్లీ సీట్లు పెరగకపోతే, చాలా సమస్య వస్తుంది.అందువల్ల ఎలాగయినా సరే, అసెంబ్లీ సీట్లను పెంచేందుకు సహకరించాలని కెసిఆర్ ప్రధాని కోరాడని షబ్బీర్ అన్నారు.

’ కెసిఆర్ అవకాశవాది. చిరువ్యాపారుల, దినకూలీ వాళ్ల అగచాట్లు ఆయనకు పట్టడం లేదు. వీళ్లంతా కేంద్రం మీద కోపంగా ఉన్నారని ప్రధానితో అప్పాయంట్ మెంట్ సంపాయించి, అసెంబ్లీ సీట్ల పెంచడం మీద బేరం పెట్టాడు,‘ అని ఆయన ఆరోపించారు.

’పెద్ద నోట్ల రద్దు తర్వాత రాష్ట్రం ఆదాయం పడిపోయిందని, దీనిమీద ప్రధానికి ఆయన ఒక నివేదిక ఇచ్చానని చెప్పుకోవడం అబద్ధం. ఆ రిపోర్టును ప్రజల కోసం విడుదల చేయవచ్చుగదా. రిపోర్టనేది టిఆర్ ఎస్ చేసిన మీడియా లీకు మాత్రమే. అంతా కల్పితం.మాకు స్పష్టమయిన సమాచారం వుంది,‘ అని ఆయన అన్నారు.

కెసిఆర్ మంతనాలాడిన మరొక విషయం, ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో ప్రధాని సహాయం అని షబ్బీర్అన్నారు. ఈ కేసు ఇపుడు కీలకంగా మారినందున కెసిఆర్ ప్రధానిని కలసి గట్టున పడే మార్గం గురించి చర్చించినట్లు తమకు సమాచారం ఉందని ఆయన చెప్పారు.

నోట్ల తో వచ్చిన ప్రజల కష్టాల కంటే, ఎన్నికల హామీలను అమలుచేయడం కంటే, తన పార్టీని ఎట్లా కాపాడుకోవాలనేది ఆయనకు జాతీయ సమస్య అయిందని షబ్బీర్ విమర్శించారు.