రాశి చూసి.. మీ బాయ్ ఫ్రెండ్ ఎలాంటివాడో చెప్పేయచ్చు..

What kind of boyfriend your man will be as per his zodiac sign
Highlights

మీ బాయ్ ఫ్రెండ్ రాశిని బట్టి.. అతని స్వభావం ఎలాంటిదో చెప్పేయచ్చు అంటున్నారు నిపుణులు. 

మీది ఏ రాశి? మీ బాయ్ ఫ్రెండ్ ది ఏ రాశి? మీ  బాయ్ ఫ్రెండ్ మీతో చాలా ప్రేమగా ఉంటాడా..? కేరింగ్ గా ఉంటాడా? ఇవన్నీ ఇప్పుడు ఎందుకు అంటారా..? ఏమి లేదండి.. మీ బాయ్ ఫ్రెండ్ రాశిని బట్టి.. అతని స్వభావం ఎలాంటిదో చెప్పేయచ్చు అంటున్నారు నిపుణులు.  ఏ రాశి వాళ్లు ఎలా ఉంటారో.. ఒకసారి చూసేద్దామా..

మేషరాశి..

ఈ రాశిగల అబ్బాయిలు.. చూడటానికి అందంగా ఉంటారు. ఎప్పుడూ ఏదో ఒక సాహసాలు చేస్తూనే ఉంటారు. ట్రెక్కింగ్, రాక్ క్లైంబింగ్ ల మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి అబ్బాయిలు ఎవరైనా అమ్మాయితో సీరియస్ గా రిలేషన్ లో ఉంటే.. వాళ్లపట్ల చాలా ప్రేమగా కేరింగ్ గా ఉంటారు. అప్పుడప్పుడు కాస్త అసహనంగా, పొగరుగా వ్యవహరిస్తుంటారు.

వృషభ రాశి..

ఈ రాశి అబ్బాయిలు చాలా డెడికేటింగ్ గా ఉంటారు. వీళ్లు.. తమ పార్ట్ నర్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ప్రతి విషయంలోనూ వారి పార్ట్ నర్స్ ఉన్నతంగా ఉండాలని ఆలోచిస్తారు. ఎక్కువ రొమాంటిక్ గా ఉంటారు.

మిథున రాశి..

ఈ రాశి అబ్బాయిలు చాలా ఇంట్రెస్ట్ గా ఉంటారు. వారికి ఉన్న కుటుంబసభ్యులు, ఫ్రెండ్స్ సర్కిల్ లో చాలా పాపులర్ టాక్ తెచ్చుకుంటాడు. చాలా స్పాంటేనియస్ గా ఉంటారు. సర్ ప్రైజ్ లాంటివి మాత్రం వీరి దగ్గర నుంచి ఎక్స్ పెక్ట్ చేయలేము

కర్కాటక రాశి..

ఈ రాశి వాళ్లు చాలా ఎమోషనల్ గా ఉంటారు. వారి పార్ట్ నర్స్ తో చాలా ఎఫెక్షన్ తో ఉంటారు. కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్  అంటే ఈ రాశి వాళ్లే అని చెప్పవచ్చు. కుటుంబాన్ని ఎప్పుడూ సంతోషంగా ఉంచాలనుకుంటారు. ఎప్పుడైనా వారిని ఇగ్నోర్ చేస్తే మాత్రం తట్టుకోలేరు.

సింహరాశి..

ఈ రాశి వాళ్లు చాలా కాన్ఫిడెంట్ గా ఉంటారు. వారి పార్ట్ నర్స్ విషయంలో మాత్రం ఓవర్ ప్రొటెక్టివ్ గా ఉంటారు. గొడవలకు దూరంగా ఉంటారు. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉంటారు.

కన్యరాశి..

ఈ రాశి అబ్బాయిలు ప్రతి విషయంలో పర్ఫెక్షన్ కోరుకుంటారు. చాలా ముక్కుసూటిగా వ్యవహరిస్తారు. ఏదైనా చెప్పాలనుకుంటే  ఎదుటి వారికి వెంటనే చెప్పేస్తారు. ఒకటికి రెండు సార్లు ఆలోచించరు. వారి పార్ట్ నర్స్ నుంచి ప్రశంసలు ఆశిస్తుంటారు. ఎక్కువగా ప్రేమిస్తారు.

తులరాశి..

ఈ రాశి అబ్బాయిలు ఎప్పుడూ కూల్ గా బ్యాలెన్సింగ్ గా ఆలోచిస్తారు. చాలా తెలివిగా ఆలోచిస్తారు. సరైన రీజన్ లేకుండా ఎవరితోనూ అనవసరంగా చర్చలు పెట్టరు. పార్ట్ నర్స్ ని ఎప్పటికప్పుడు సర్ ప్రైజ్ చేస్తుంటారు. చాలా రొమాంటిక్ గా ఉంటూ అడ్వెంచర్ ట్రిప్స్ పై ఆసక్తి చూపిస్తారు.

వృశ్చిక రాశి..

ఈ రాశి వారు చాలా నమ్మకంగా ఉంటారు. తమ పార్ట్ నర్స్ ని సంతోషంగా ఉంచడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు. ఎక్స్ ప్రెసివ్ గా ఉండరు. లైంగిక జీవితం పట్ల వీరికి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. కొన్ని కొన్ని విషయాల్లో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు.

ధనస్సు రాశి..

ఈ రాశి అబ్బాయిలు చాలా తెలివికలవారు. ఏ విషయం పైనేనా అనర్గలంగా చర్చించగలరు. చాలా  ఫ్రెండ్లీగా ఉంటారు. వీరితో ఉంటే..అసలు బోర్ అనేది కొట్టదు.

మకరరాశి..

ఈ రాశి అబ్బాయిలకు ఓపిక చాలా ఎక్కువ. చాలా కేరింగ్ గా ఫన్నీగా ఉంటారు. పార్ట్ నర్స్ కి గిఫ్ట్ ఇస్తూ ఆశ్చర్యపరుస్తుంటారు.

కుంభరాశి..

ఈ రాశి అబ్బాయిలు ఎప్పుడూ సొసైటీ గురించి ఆలోచిస్తుంటారు. ఎక్కువ సమయం సీరియస్ గా ఉంటారు. అతని ఫ్రెండ్ సర్కిల్ కూడా దాదాపు ఇలానే ఉంటుంది. చాలా మెచ్యూర్డ్ గా ఆలోచిస్తారు. తొందరగా ప్రేమలో పడరు. పడితే మాత్రం ఆ రిలేషన్ కి చాలా కట్టుబడి ఉంటారు.

మీనరాశి..

ఈ రాశి అబ్బాయిలు చాలా రొమాంటిక్ గా ఉంటారు. వారి జీవిత భాగస్వామి ముఖ్యమైన తేదీలను కచ్చితంగా గుర్తుంచుకుంటారు. వారి పార్ట్ నర్ ని చాలా స్పెషల్ గా చూసుకుంటారు. ప్రత్యేకమైన తేదీలను గుర్తుంచుకొని మరీ సర్ ప్రైజ్ లు ప్లాన్ చేస్తారు. కొంచెం సెన్సిటివ్ గా ఉంటారు.

 

loader