జగన్ చేస్తున్నది పాదయాత్ర కాదు, హెల్త్ వాక్

First Published 7, Dec 2017, 12:50 PM IST
what jagan  doing is not padayatra but a health walk
Highlights

పాదయాత్ర పవిత్రమయిన కార్యక్రమం. అబద్దాలు ప్రచారం చేస్తూ జగన్ పాదయాత్ర అపవిత్రం చేస్తున్నారు

ప్రతిపక్షనాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పాదయాత్ర  మీద అనంతపురం జిల్లా మంత్రి కాల్వ శ్రీనివాసులు మండిపండారు. ప్రజాసంకల్పయాత్ర అనంతపురం జిల్లాలోకి ప్రవేశించి విజయవంతంగా సాగడం టిడిపినేతలకు బాగా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే, జగన్ యాత్ర విపరీతంగా జనాన్ని అకట్టుకుంటూ ఉంది. చివరకు అనంతపురం జిల్లా టిడిపి పెద్దారెడ్డి గా పేరున్న జెసి దివాకర్ రెడ్డి సొంతవూరు తాడిపత్రిలో జనం అసాధారణం. ఇదెలా సాధ్యం. అనంతపురం జిల్లా టిడిపి అధినేతకు రెండో కన్ను. మొదటి కన్ను గోదావరి జిల్లా. మరలాంటి చోట ఈ జనమేమిటి? అందుకే ఇపుడు పార్టీ బిసి నేత కాలువ శ్రీనివాసులును రంగం మీదకు దించింది. ఆయన జగన్ ఆయన యాత్రని మార్నింగ్ వాక్, ఈవెనింగ్ వాక్ అని ఎద్దేవ చేశారు.

పాదయాత్ర పొడుగునా జగన్మోహన్ రెడ్డి  అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మంత్రి కాల్వ శ్రీనివాసులు మండిపడ్డారు. ‘పాదయాత్ర ఒక పవిత్రమైన కార్యక్రమం.గతంలో ఎందరో ఉన్నతాశయాలతో పాదయాత్రలు చేశారు. కాని  జగన్ మాత్రం అబద్దాలు ప్రచారం చేస్తూ యాత్రను అపవిత్రంచేస్తున్నారు. ఆయన యాత్ర మార్నింగ్ వాక్ , ఈవెనింగ్ వాక్ లాగా ఉంది.  ఏదో ఆరోగ్యం కుదుటబడాలని పొద్దనొకసారి, సాయంకాలంమొకసారి  వాక్‌ చేస్తున్నట్లుంది. ఇలాంటి హెల్త్ వాక్ వల్ల టీడీపీకి ఎలాంటి నష్టం ఉండదు. ప్రజా సమస్యలపై జగన్‌ పాదయాత్ర చేస్తే ప్రజలు హర్షించే వారు,’’ అని కాల్వ శ్రీనివాసులు అభిప్రాయపడ్డారు.

 

loader