2016లో ఆయన గూగుల్ నుంచి  అందుకున్న మొత్తం డబ్బు 200 మిలియన్ అమెరికన్ డాలర్లు.

గూగుల్ సీఈఓ సుంద‌ర్ పిచ్చాయ్ వయసు కేవలం 44 సంవత్సరాలు.

ఆయన ఏడాది మొత్తం కంపెన్సేషన్ ఎంతో తెలుసా..? ఏడాదికి రూ.1285.5 కోట్లు.

 2016లో ఆయన గూగుల్ నుంచి అందుకున్న మొత్తం డబ్బు 200 మిలియన్ అమెరికన్ డాలర్లు.

దీనితో పాటు 650,000 అమెరికన్ డాల‌ర్ల‌ను వేత‌నంగా పొందారు. నిజానికిది 2015 లో ఆయన జీతంకంటే కొద్దిగా తక్కువ.

2015 సంవ‌త్స‌రంలో సుంద‌ర్ పిచాయ్ 652,500 అమెరికన్ డాల‌ర్ల‌ను వేత‌నంగా పొందారు.

చాలా కాలంగా గూగుల్‌తో అనుబంధం ఉన్న సుంద‌ర్ పిచాయ్ ఆ సంస్థ‌లో అంచెలంచెలుగా ఎదుగుతూ 2015లో సీఈఓ అయ్యారు. గూగుల్ విజయవంతంగా విడుదల చేసిన అనేక ప్రాడక్ట్స్‌లో కీల‌క పాత్ర పోషించారు. పిచాయ్ నేతృత్వంలో యూట్యూబ్ సేల్స్, అడ్వర్టయిజ్ మెంట్ ఆదాయం విప‌రీతంగా పెరిగాయి. హార్డ్ వేర్ క్లౌడ్ కంప్యూటింగ్‌లో కూడా రాబడి బాగా పెరిగింది. దాదాపు 3.1 బిలియ‌న్ డాల‌ర్లు మేరా మార్కెటింగ్ జ‌రిగింది. ఇదంగా సుంద‌ర్ పిచాయ్ గూగుల్ సంస్థ‌కు సీఈఓగా బాధ్య‌త‌లు చేప‌ట్టాకే జ‌రిగిందని అందుకే ఆయనకు అంత పెద్ద ఎత్తున వేతనాలు , ఇతర ఆదాయాలు ప్రకటించినట్లు కంపెనీ చెబుతున్నది.

2016 లో కంపెనీని కాంపెన్సేషన్ కమిటీ నుంచి 98.7 మిలియన్ డాలర్ల స్టాక్ అవార్డు ఆయనకు లభించింది. ఇదొక బోనస్ లాంటిది. 2015లో ఆయనకు లభించిన 99.8 డాలర్ల కంటే ఇది దాదాపు రెట్టింపు. 

2016లో గూగుల్ ఒక స్మార్ట్ ఫోన్ ను, విఆర్ హెడ్ సెట్ ను, రౌటర్, వాయిస్ కంట్రోల్డ్ స్మార్ట్ స్పీకర్ ను విడుదల చేసింది. ఇవన్నీ లాభాలు తెచ్చాయి.