శ్రీదేవి కులమేమిటి? సోషల్ మీడియాలో చర్చ
శ్రీదేవి కమ్మయా, రెడ్డియా. లేక రెండు కులాలకు చెందినదా? చర్చ మొదలయింది
ఆంధ్రదేశంలో కులం చర్చ జరక్కపోతేనే ఆశ్చర్యం. ఎవరైనా తెలుగు వాళ్లు ఒక హోదాలోకి చేరుకోగానే ఆయనకులం అంచనా వేస్తారు. సెలెబ్రిటిని వెంటనే కులాలు వోన్ చేసుకుంటాయి. కుల చర్చ జరగడం తప్పేమి కాదు. భారతదేశంలో ఎవరైనా ఒక కులంలో పుట్టి అదేకులంలో చావాల్సిందే. తాను కులం వద్దునుకున్నా,కులాన్నికులాంతర వివాహానలతోనే,మతాంతర వివాహాలతోనో పోగొట్టుకున్నా చుట్టూర ఉన్న చుట్టాలు పట్టాలు కులస్థులువెదికి పట్టుకొచ్చి మనకులం మనకిస్తారు. కుల చర్చ, కుల విద్వేషం కోసం కాకుండా కుల సౌభాగ్యం కోసం, సమిష్టిమేలుకోసమే సాగితే మంచిదే. ఒక కులాన్ని హీనపర్చేందుకో, స్వార్థ ప్రయోజనంకోసం వాడుకోనంతవరకు కులం చర్చ మంచిదే.
ఏది ఏమయినా తెలుగు నాట కుల చర్చ జరుగుతుంది. కమ్యూనిస్టుల నుంచి కన్వర్టెడ్ క్రిష్టియన్లదాకా కులం చర్చ సాగుతూనే ఉంటుంది. దేశం విడిచిపారిపోయినా, మనిషి చచ్చి పోయినా కుల చర్చ ఆగదు.
భారత దేశపు అగ్రతార శ్రీదేవి కులమేమిటి? ఈ చర్చ మీడియాలో మొదలయింది.
స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సోషల్ మీడియాలో ఈ చర్చ జోరుగా సాగుతూ ఉంది. శ్రీదేవి చనిపోయిన మరుసటి రోజునే పేరును బట్టి, వూరును బట్టి శ్రీదేవి కులాన్ని అంచనా వేయడం మొదలుపెట్టారు. మొదట కాపు పెద్దాయన ఫోన్ చేసి శ్రీదేవి కాపు కులస్థురాలని అనుమానం వ్యక్తం చేశారు. అయితే, ఆయనెందుకో దాని మీద పట్టబట్టలేదు, బహుశా బలయమని సాక్ష్యం లేకపోవడంతో. తమిళనాడు కమ్మలు, కాపులు నాయుడు పేరు తగిలించుకుంటారు కాబట్టి ఆయన కాపుగా భావించి ఉంటారు.
మధ్యాహ్నానికి టివిలో శ్రీదేవి తల్లి తిరుపతికి చెందిన రాజేశ్వరి అని తెలియగానే కులనిర్ధారణ కొంత సులువయింది.ఆమె రెడ్డి గానిర్ధారించారు. రెడ్డి జాగృతి దీనికి సంబంధించి చాలా వివరాలందించింది. ఈ బ్లాగ్ అందించిన వివరాలు:
అతిలోక సుందరి శ్రీదేవి గారు #రెడ్డి_బిడ్డ , #తెలుగు_బిడ్డ
తాత పేరు #కటారి_వెంకటస్వామి_రెడ్డి (తిరుపతి ) , తండ్రీ పేరు #అయ్యప్పన్_రెడ్డి ( చెన్నై )
వెంకటస్వామి రెడ్డి గారు బస్సుల ఓనర్ , తిరుపతి నుండి జమ్మలమడుగు వరకు బస్సులు నడిపేవారు,తరువాత చెన్నైలో ఉద్యోగం సంపాదించిన వెంకటస్వామి రెడ్డి చెన్నై లో స్థిరపడ్డారు.
వెంకటస్వామి రెడ్డి కూతురు రాజేశ్వరమ్మ శివకాశీ కి చెందిన తెలుగువాడైన న్యాయవాది అయ్యప్పన్ రెడ్డి ని వివాహం చేసుకొన్నారు .వీరిద్దరికీ కలిగిన ఇద్దరు కుమార్తెల్లో ఒకరే శ్రీదేవి
శ్రీదేవి గారి సినీ రంగ ప్రవేశానికి కారణం తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కామరాజ నాడార
శ్రీదేవి తండ్రి అయ్యప్పన్ రెడ్డి , ఆయన స్నేహితుడు బాలు నాయక్కర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు. శ్రీదేవికి నాలుగేళ్ల వయసప్పుడు ఆమె తండ్రి కామరాజ నాడార్ వద్దకు వెళ్తూ ఆమెను కూడా తీసుకెళ్లారు.
శ్రీదేవిని చూసిన ఆయన, ఈ బాలిక సినిమాల్లో నటిస్తే బాగుంటుందని అయ్యప్పన్ రెడ్డికి సూచించారు.
అంతటితో ఆగకుండా.. నేరుగా తమిళ సినీ గేయ రచయిత కన్నదాసన్ కు కబురు చేసి, పాపను సినీ అవకాశాల కోసం సిఫారసు చేయమని కోరారు.
దీంతో ఆయన బుల్లి శ్రీదేవిని నిర్మాత చిన్నప్పదేవర్ కు పరిచయం చేశారు. అప్పటికే ‘తునైవన్’ సినిమాలో బాల కుమారస్వామి (మురుగన్) పాత్ర కోసం అన్వేషిస్తున్న ఆయన, శ్రీదేవిని చూడగానే ఆ పాత్రకు ఎంపిక చేశారు. ఆ పాత్రను అద్భుతంగా పోషించిన శ్రీదేవి ఆ తరువాత వెనుదిరిగి చూసుకోలేదు.
భారతదేశంలో పూర్తి పురుషాధిక్య ప్రపంచంగా ఉన్న సినీ పరిశ్రమలో తన నటనతో ఆమె నెంబర్ వన్ హీరోయిన్ గా ఎదిగారు.
రెడ్డి జాగృతి & రెడ్డి హెల్ప్ లైన్
9849493388 , 9533099999 , 9000465027 ,
9640663366 , 9603059594 , 9133151515 ,
8686272828 , 8096095555
Whatsapp Group No : 9550493388
http://www.reddyjagruthi.com
అయితే,నిజానికి కమ్మలు చాలా సంవత్సరాల కిందటే శ్రీదేవి తమకులంలో చేర్చుకున్నారు. కమ్మ ప్రముఖలు జాబితాలో ఆమె పేరు లిఖించారు. రెడ్డి జాగృతిలాగే, కమ్మకులం వారికి ఒక బ్లాగ్ ఉంది. శ్రీదేవికి 2013లో పద్మశ్రీ వచ్చింది. శ్రీదేవితో పాటు ఆ యేడాది మరొక ముగ్గురు కమ్మలకు పద్మ అవార్డులొచ్చాయి. శ్రీదేవిని కమ్మవారిలో చేర్చకున్న బ్లాక్ వివరాలివి.
Sridevi: (Padmashri)
Sridevi has been named for the Padma Shri, India's civilian award, on the eve of 64th Republic Day.
The 49-year-old (A Kamma girl, born in Meenampatti village near Sivakasi of Virudhunagar district - Tamilnadu) who made a grand Bollywood comeback in 2012 with a strong female-centric role in "English Vinglish", boasts of a filmography of 265 movies. She came back after a 15-year sabbatical, and won hearts with her simple and subtle performance in the film as a homemaker struggling to learn English.
Married to Hindi film producer Boney Kapoor, Sridevi has two daughters - Jhanvi and Khushi. Age has failed to take a toll on her as she looks as radiant as ever and spreads the same magic in front of the camera.
(http://kammasworld.blogspot.in/2013/01/3-kammas-conferred-with-padma-awards.html)
ఈ లోపు ఒక ఫేస్ బుక్ చర్చలో పాల్గొంటు రామచంద్ర శ్రీదేవి కమ్మ కాదు,రెడ్డి కాదు పొమ్మన్నారు
అయ్యంగార్ బ్రాహ్మణకుటుంబానికి చెందినది ఆయన చెప్పారు. ఆయన దీనికి ఎలాంటి ఆధారాలు చూపలేదు. చాాలా మంది ఆమె సంప్రదాయక బ్రాహ్మణ కుటుంబం అని వాదిస్తున్నారు కూడా. అయితే, వారేవి రాత పూర్వకంగా సాక్యం చూపించేక పోయారు, ఇది కింది వైబ్ సైట్ లాగా.
ఈ లోపు తమిళనాడుకు చెందిన ఒక వైబ్ సైట్ శ్రీదేవి కుటుంబం గురించిన ఆస్తక్తి కరమయిన విషయాలు వెల్లడించింది.
ఆమెకు టుంబ నేపథ్యం, రాజకీయ నేపథ్యం గురించి చెబుతూ తండ్రి అయ్యప్పన్ నాయుడుఅని పేర్కొంది.
అంతేకాదు, వారిది రాజకీయకుటుంబం.
శ్రేదేవి పెదనాయన రామస్వామి నాయుడు 1977 లో జనతా పార్టీ తరఫున ఎమ్మెల్యే అయ్యారు. అంతేకాదు, ఆయన 25 సంవత్సరాలు సమితి ప్రెశిడెంటుగా కూడా పనిచేశారు.
తండ్రి అయప్పన్ కూడా ఒకసారి 1989లో కాంగ్రెస్టికెట్ మీద పోటీ చేసి ఓడిపోయారు.
ఆ ఎన్నికల్లో ఆమె తండ్రితరఫున ఇంటింటా ప్రచారం చేశారని ఈ వెబ్ సైట్ చెప్పింది.
ఈ లెక్న తల్లి తరుపతి కాపు (రెడ్డి) అయి వుండవచ్చు.
ఆమె అయ్యప్పన్ నాయుడు(కమ్మ)ను పెళ్లి చేసుకుని ఉండవచ్చు.
ఇలా రెడ్డి కాపుల వారసురాలుగా శ్రీదేవిని తెలుగోళ్లు తేల్చవచ్చు. అపుడు కథా సుఖాంతమవుతుంది.