Asianet News TeluguAsianet News Telugu

ఇండియన్ టెక్కీస్ నేర్చుకోవాల్సినవి ఇవే..

  • ఈ నూతన సంవత్సరంలో మంచి కంపెనీలో ఉద్యోగం సాధించాలన్నా.. ప్రస్తుతం పనిచేస్తున్న కంపెనీలో మరింత ఉన్నత స్థాయికి వెళ్లాలన్నా.. కొన్ని టెక్నాలజీలు నేర్చుకోవడం ఆవశ్యకం అంటున్నారు నిపుణులు.
What are the most demanded skills for IT jobs in 2018

గతేడాది మనదేశంలో సాఫ్ట్ వేర్ రంగంలో చాలా మార్పులు వచ్చాయి. కొన్ని కంపెనీలు ఉద్యోగులను విధుల నుంచి తొలగిస్తే.. చాలా మంది కి ఈ ఏడాది ఉద్యోగాలు దొరకడం కూడా కష్టమైంది. మరోవైపు హెచ్1బీ వీసా విధానం కూడా కష్టతరం చేయడంతో.. అమెరికా వెళ్లేవారి సంఖ్య కూడా తగ్గిపోయింది. అయితే.. ఈ పరిణామాలన్నింటి విశ్లేషించిన తర్వాత  ఐటీ ప్రొఫెషనల్స్ ఒక అవగాహనకు వచ్చారు. ఐటీ ఉద్యోగులంతా తమ స్కిల్స్ ని మెరుగుపరుచుకోవాల్సిందేనని తేల్చిచెప్పారు. కొత్త కొత్త టెక్నాలజీలపై పట్టు సాధించిన వారు మాత్రమే ఐటీ రంగంలో పురోగతి సాధించగలరని అంటున్నారు. ఈ నూతన సంవత్సరంలో మంచి కంపెనీలో ఉద్యోగం సాధించాలన్నా.. ప్రస్తుతం పనిచేస్తున్న కంపెనీలో మరింత ఉన్నత స్థాయికి వెళ్లాలన్నా.. కొన్ని టెక్నాలజీలు నేర్చుకోవడం ఆవశ్యకం అంటున్నారు నిపుణులు. అవేంటో ఓసారి చూసేద్దామా...

1.బిగ్ డేటా అండ్ ఎనలటిక్స్..

ఈ టెక్నాలజీ.. సాఫ్ట్ వేర్ ఉద్యోగులు నేర్చుకోవడం చాలా ఉపయోగకరం. రానున్న సంవత్సరాల్లో దీనికి మంచి డిమాండ్ ఉందని నిపుణులు చెబుతున్నారు. స్టార్టప్ కంపెనీల నుంచి ఫార్చూన్ 500 కంపెనీల వరకు ఈ టెక్నాలజీ డిమాండ్ ఉంది. ఈటెక్నాలజీ మీద పట్టు సాధించిన వారికి జీతాలు కూడా బాగానే ఆఫర్ చేస్తున్నారు. సంవత్సరానికి రూ.12లక్షల దాకా జీతం ఇచ్చే అవకాశం ఉంది.

2. క్లౌడ్ కంప్యూటింగ్...

ఇప్పటికే క్లౌడ్ కంప్యూటింగ్ ఐటీ ఉద్యోగాల సంస్కృతిని మార్చేసింది. ఈ ఏడాది ఈ టెక్నాలజీకి డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉంది.

3. సైబర్ సెక్యురిటీ...

సైబర్ సెక్యురిటీ టెక్నాలజీకి కూడా రానున్న రోజుల్లో డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా సాఫ్ట్ వేర్ సంస్థలన్నీ ఈ టెక్నాలజీ పైనే దృష్టిపెడుతున్నాయి. సైబర్ సెక్యురిటీ ఆర్కిటెక్ట్స్ కి భారత్ లోని కంపెనీలు సంవత్సరానికి రూ.19లక్షల పైనే జీతం ఆఫర్ చేస్తున్నాయి. ఇన్ఫర్మెషన్ సెక్యురిటీ మేనేజర్స్ కి రూ.10లక్షలు, సెక్యురిటీ ఆడిటర్స్ కి రూ.9.81లక్షలు ఆఫర్ చేస్తున్నాయి.

4. మొబైల్ అండ్ సాఫ్ట్ వేర్ డెవలప్ మెంట్

ఈ టెక్నాలజీలో పట్టు సాధించిన వారికి డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది. ఇందులో పట్టు సాధిస్తే.. ప్రారంభ జీతమే రూ.8.5లక్షల జీతం అందించడానికి కంపెనీలు  సిద్ధంగా ఉన్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios