Asianet News TeluguAsianet News Telugu

అలాంటమ్మాయిలు మాకొద్దంటున్న అబ్బాయిలు

  • చదువుకున్న అమ్మాయిలు వద్దంటున్న అబ్బాయిలు
  • ముఖ్యంగా ఫేస్ బుక్, వాట్సాప్ వాడేవారు వద్దంటున్న అబ్బాయిలు
westbengal boys says they dont want this type of girls

పెళ్లి అనగానే సాధారణంగానే .. అమ్మాయిలు, అబ్బాయిలు వారికి కాబోయే జీవిత భాగస్వామిలో ఈ లక్షణాలు ఉండాలి. అలా ఉండాలి.. ఇలా ఉండాలి అంటూ ఎన్నో ఊహించేసుకుంటారు. ప్రస్తుత కాలంలో అయితే.. చాలా మంది అబ్బాయిలు.. చదువుకున్నఅమ్మాయి కావాలని... ఉద్యోగం చేస్తే మరీ మంచిదని, టెక్నాలజీ గురించి పూర్తిగా తెలిసిన అమ్మాయిలనే పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నారు. అయితే..  విచిత్రం ఏమిటంటే.. పశ్చిమ్ బెంగాల్ రాష్ట్రంలో అబ్బాయిలు మాత్రం ఇందుకు భిన్నంగా కోరుకుంటున్నారు.

అబ్బాయిలు ఉన్నత స్థానాల్లో ఉన్నప్పటికీ.. చదువుకున్న అమ్మాయిలు వద్దంటున్నారు. ముఖ్యంగా ఫేస్ బుక్, వాట్సాప్ లను వాడని అమ్మాయిలే కావాలని పట్టుబడుతున్నారు. ఈ మేరకు మ్యాట్రిమోనీ వెబ్ సైట్లలో  ప్రకటనలు కూడా జారీ చేస్తున్నారు. ‘‘ మా అబ్బాయి ప్రభుత్వ ఉద్యోగి. తను పెళ్లి చేసుకునే అమ్మాయి వయసు 18 నుంచి 22 ఏళ్లుండాలి. కనీసం ఇంటర్మీడియట్‌ పాసైతే సరిపోతుంది. వీటన్నిటికన్నా ముఖ్యమైనది ఆ అమ్మాయి సామాజిక మాధ్యమాలు ఫేస్‌బుక్‌, వాట్సాప్‌కు బానిస అయ్యుండకూడదు’’ ఇది ఒక అబ్బాయి కోసం వాళ్ల తల్లిదండ్రులు ఇచ్చిన ప్రకటన. ఇలాటి ప్రకటనలే అక్కడ ఎక్కువగా రావడం గమనార్హం.

 ఇందుకు కారణాలు లేకపోలేదు. సోషల్ మీడియా వెబ్ సైట్స్ కి బానిసలు గా మారే అమ్మాయిలు.. కుటుంబాలను సరిగా పట్టించుకోరని వారి అభిప్రాయం. వీటి కారణంగానే ఎక్కువ మంది పెళ్లి అయిన కొద్ది రోజులకే విడాకులు కావాలంటూ కోర్టు మెట్లు ఎక్కుతున్నారని వారు చెబుతున్నారు. అందుకే తమకు టెక్నాలజీ తెలిసిన అమ్మాయిల కన్నా.. వంటా వార్పు వచ్చిన వారైతే చాలని చెబుతున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios