‘వైఫై’ అప్పు తీసుకోవచ్చు

we can barrow WIFI by using P2P mobile aap
Highlights

  • ఓపెన్ గార్డెన్ ఇటీవల పీ2పీ( పీర్ టూ పీర్) అనే యాప్ ని విడుదల చేసింది.
  • ఈ యాప్ సాయంతో వైఫై అప్పు తీసుకోవచ్చు

ప్రస్తుత కాలంలో దాదాపు అందరికీ ఇంట్లో వైఫై ఉంటోంది. ఆఫీసుల్లోనూ ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. ఎలాగు.. ఇంట్లో, ఆఫీసులో వైఫై ఉంది కదా.. మళ్లీ ఎందుకు ఖర్చు అని చాలా మంది మొబైల్ డేటా వైపు చూడటం లేదు. మరి బయటకు వెళ్లినప్పుడు ఏదైనా అత్యవసరం వస్తే.. అప్పుడేమి చేస్తారు? ఇది కొందరి సమస్య. మరికొందరికీ..ఇంట్లో, ఆఫీసులో వైఫై ఉండి.. మొబైల్ డేటా వాడకుండా అలానే వేస్ట్ అయిపోతోంది. ఇది ఇంకొందరి సమస్య. ఇప్పుడు ఈ సమస్యకు పరిష్కారం లభించింది. వైఫై లేని వారికి మీ మొబైల్ డేటాని షేర్ చేయవచ్చు. కాకపోతే వైఫై వాడుకున్న వారు కొంత డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. అలా అని ఆ ఇద్దరు వ్యక్తులు పక్క పక్కనే ఉండాల్సిన అవసరం కూడా లేదు.

వివరాల్లోకి వెళితే.. ఓపెన్ గార్డెన్ ఇటీవల పీ2పీ( పీర్ టూ పీర్) అనే యాప్ ని విడుదల చేసింది. ఈ యాప్ ని ఉపయోగించి నెట్ సదుపాయం లేని వాళ్లు వేరే వారి వద్ద నుంచి స్వీకరించవచ్చు. కాకపోతే.. కచ్చితంగా ఆ ఇద్దరు ఈ యాప్ ని ఇనిస్టాల్ చేసుకోవాలి. ఉదాహరణకు ఒక వ్యక్తికి అత్యవసరంగా నెట్ కావాల్సి వచ్చిందనుకోండి. ఆ వ్యక్తి తన పీ2పీ యాప్ ని ఓపెన్ చేయాలి. అప్పుడు మొబైల్ డేటా సదుపాయం ఉండి.. మీకు దగ్గరలోని వ్యక్తుల వివరాలు మీకు కనిపిస్తాయి. వెంటనే దానికి కనెక్ట్ అయ్యి.. వారి మొబైల్ డేటాని ఉపయోగించుకోవచ్చు. ఎంత వాడుకుంటే.. దానికి తగిన డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ యాప్ ఆండ్రాయిడ్ వర్షన్ ని మాత్రమే విడుదల చేశారు. త్వరలోనే ఐవోఎస్, మాక్, పీసీ వర్షన్ లను కూడా విడుదల చేయనుంది. దీనిని గూగుల్ ప్లే స్టోర్ నుంచి  డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

loader