అత్య‌వ‌స‌ర బృందాల కాల‌ప‌రిమితినిమ‌రో వారం రోజుల పాటు పొడిగించిన జలమండలి
హైదరాబాద్ మహానగరంలో భారీ వర్షాలు కురిసిన నేపధ్యంలో జలమండలి ఎండీ శ్రీ.ఎం.దానకిషోర్ జలమండలి డైరెక్టర్లు, సీజీఎమ్లతో మంగళవారం రోజున ఉదయాన్నే అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈసందర్బంగా అధికారులకు, ప్రజలకు వర్షాలపుడు తీసుకోవలసిన జాగ్రత్తల ఆదేశాలించారు.
1. ఇప్పటీకే ఉన్న ఎమ్సీసీ నంబరు 155313కు అదనంగా అత్యవసర కంట్రోల్ రూమును ఖైరతాబాద్లోని ప్రధాన కార్యాలయంలో రానున్న72 గంటలు అందుబాటులో అందుబాటులో ఉంచడం జరుగుతుంది. ఏవైనా సమస్యలు, ఫిర్యాదులు ఉంటే 9989996948 నంబరుకు డయల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు.
2.జలమండలి వద్ద ఉన్న భారీ ఎయిర్ టెక్, మిని ఎయిర్ టెక్ యంత్రాలను రానున్న 72 గంటలు రాత్రులు సైతం పారిశుద్ద్య పనుల్లో వినియోగించడం జరుగుతుంది.
3.పారిశుద్ద్య సమస్యల్లో జీహెచ్ఎంసీ అధికారులతో మరింత సమన్వయం కొరకు జలమండలి ప్రత్యేక బృందాలు జీహెచ్ఎంసీ కంట్రోల్ రూములో విధులు నిర్వహిస్తారు.
4.నగరంలోని ఓ అండ్ ఎమ్ డివిజన్లలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో మురుగునీరు ఉప్పొంగడాన్ని పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా సీనియర్ అధికారులను నియమించడం జరిగింది. అలాగే జలమండలి ఎండీ సైతం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తారు.
5.డిజిఎమ్లు తప్పనిసరిగా అన్ని మ్యాన్హొళ్లను తనిఖీ చేసి..వాటిని మూతలు ఏవిధంగా ఉన్నాయో తెలుసుకోవాలని ఆదేశించారు.
6.ప్రతి ఒక్క మేనేజర్ తప్పనిసరిగాప్రధాన రహదారిపై ఉన్న మ్యాన్హొల్ మూతలను పర్యవేక్షించాలని సూచించారు.
7.అత్యవసర బృందాల కాలపరిమితినిమరో వారం రోజుల పాటు పొడిగించడం జరిగింది.
8.హెచ్చరిక బోర్డులు మరియు ఎరుపురంగు జెండాలను తప్పనిరిగా డీప్ మ్యాన్హొళ్ల వద్ద ఏర్పాటు.
9.నగవాసులు ఎవరు కూడా మ్యాన్హొళ్ల కవర్లను తెరవకూడదని హెచ్చరించారు. ఏదైనా సమస్య ఉత్పన్నమయితే జలమండలి అత్యవసర కంట్రోల్ రూముకు తెలియపరచండి.
10.కాలుష్య నివారణకు బస్తీలలో క్లోరిన్ మాత్రలను పంపిణీ చేయడంలో పాటు... సాధారణ పైప్ల సరఫరా పునరుద్ధరించబడే వరకు నీటి ప్యాకెట్లను పంపిణీ చేయడం జరుగుతుంది
