పిజ్జా.. పేరు వినగానే నోరు ఊరుతోంది కదా. మనకు పిజ్జా తినాలని అనిపించింది అనుకోండి వెంటనే దగ్గర్లోని పిజ్జా సెంటర్ కి వెళ్లి మనకు నచ్చిన పిజ్జాని లాగించేస్తాం. మరి స్పేస్( అంతరిక్షం) లో ఉన్న వాళ్ల పరిస్థితి ఏమిటి..? అక్కడ వాళ్లకు ఏది కావాలన్నా వాళ్లే తయారు చేసుకోవాలి. మనకు లాగా రెడిమెడ్ గా అన్ని దొరకవు. వాళ్లకు అందుబాటులో ఉన్నవే తింటూ కాలం గడుపుతుంటారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటారా..
? మరేం లేదండి స్పేస్ లో ఉన్న ఇటాలియన్ వ్యోమగామి పావులో నెస్పోలీకి పిజ్జా తినాలని చాలా కోరికగా ఉందట. ఆ విషయాన్ని ట్విట్టర్ వేదికగా అందరితో పంచుకున్నాడు.

 

అతని కోరికని ఆలకించిన స్పేస్ సెంటర్ అందుకు అవకాశం కల్పించింది. ఇటీవల  పిజ్జా తయారు చేసుకోవడానికి కావాలసిన పదార్థాలన్నింటినీ స్పేస్ లోకి పంపించారు. ఇంకేముంది స్పేస్ లో ఉన్న వ్యోమగాముల సంతోషానికి అవధులు లేవు. స్వయంగా వారే పిజ్జా తయారు చేసుకొని తినేశారు. వారు పిజ్జా తయారు చేసి, తినే వీడియో ని పావులో ట్విట్టర్ లో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట  సందడి చేస్తోంది. మీరు కూడా ఓ లుక్కేయండి.