Asianet News TeluguAsianet News Telugu

వాల్ మార్ట్ చేతిలోకి ఫ్లిప్ కార్ట్: అమెజాన్ కు ఇక తీవ్రమైన పోటీ

ప్రపంచంలోని అతి పెద్ద రిటైలర్ వాల్ మార్ట్ ఫ్లిప్ కార్టులో 77 శాతం వాటాలను కొనుగోలు చేసింది. 

Walmart acquires 77% stake in FlipKart

న్యూఢిల్లీ: ప్రపంచంలోని అతి పెద్ద రిటైలర్ వాల్ మార్ట్ ఫ్లిప్ కార్టులో 77 శాతం వాటాలను కొనుగోలు చేసింది. ఇందుకు గాను 16 బిలియన్ డాలర్లను వెచ్చించింది. ఇది ఆ కంపెనీ అతి పెద్ద డీల్. 

భారత ఈ కామర్స్ సంస్థ 11 ఏళ్ల క్రితం ప్రారంభమైంది. ఫ్లిప్ కార్డ్ విలువను 20 బిలియన్ అమెరికా డాలర్లుగా లెక్క కట్టింది. అమెజాన్  కు ధీటుగా పోటీ ఇచ్చేందుకు వాల్ మార్ట్ ఈ డీల్ ను కుదుర్చుకున్నట్లు చెబుతున్నారు. 

డీల్ ను ఈ ఏడాది చివరికల్లా పూర్తి చేయనున్నట్లు వాల్ మార్ట్ ప్రకటించింది. వాల్ మార్ట్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించడానికి ముందు సాఫ్ట్ బ్యాంక్ సిఈవో మయవోషి సన్ ఈ డీల్ ను ధ్రువీకరించారు.

ప్రపంచంలో అతి పెద్ద ఈ కామర్స్ డీల్ ఇదే కావడం విశేషం. వాల్ మార్ట్, ఫ్లిప్ కార్ట్ ల మధ్య కొనుగోలు చర్చలు 2016 సెప్టెంబర్ లో ప్రారంభమయ్యాయి. బుధవారం ఆ  చర్చలు ముగిశాయి. 

ప్రపంచంలో అత్యంత అకర్షణీయమైన రిటైల్ మార్కెట్లలో భారత్ ఒకటి అని వాల్ మార్ట్ అధ్యక్షుడు,త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డౌ మెక్ మిల్లన్ నఅన్నారు. 

ఫ్లిప్ కార్ట్ లో ఉన్న 20 శాతం వాటాలను కూడా విక్రయించి ఇప్పటి వరకు ఆ సంస్థలో ప్రధాన పెట్టుబడిదారుగా ఉన్న సాఫ్ట్ బ్యాంక్ పూర్తి తప్పుకుంటుంది. సాఫ్ట్ బ్యాంక్ తో పాటు అస్సెల్, నాస్పర్స్ లు కూడా ఫ్లిప్ కార్ట్ నుంచి వైదొలుగుతున్నాయి. టెన్సెంట్, టైగర్ గ్లోబల్, బిన్నీ బన్సాల్, మైక్రోసాఫ్ట్ లు మాత్రం కొంత వాటాను కలిగి ఉంటాయి. 

ప్రస్తుత డీల్ తో భారతదేశంలో ఫ్లిప్ కార్ట్, అమెజాన్ కు మధ్య ఉన్న పోటీ మరింత తీవ్రమవుతుందని భావిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios