ఎన్నికల నగారా మోగించిన నారా లోకేశ్...

ఎన్నికల నగారా మోగించిన నారా లోకేశ్...

తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఐటి మంత్రి నారా లోకేశ్ ఎన్నికల నగరా మోగించారు.

వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.

ఈ రోజు కృష్ణా జిల్లా పోరంకిలో జన్మభూమి కార్యక్రమంలో మాట్లాడుతూ

‘‘రాష్ట్రంకోసం చంద్రబాబు అహర్నిశలు కష్టపడుతున్నారు.. ఆయనకు మీరిచ్చే కృతజ్ఞత ఓటు ద్వారానే చూపాలి.రాబోయే రోజుల్లో బారి మెజారిటీతో టీడీపీ ని గెలిపించాలి,’’ అని కోరారు.

అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజల వద్దకు వచ్చి పనిచెయ్యాలనే ఉద్దేశ్యంతోనే జన్మభూమి కార్యక్రమం ఏర్పాటుచేసినట్లు ఆయన చెప్పారు.

లోకేశ్ చెప్పిన మరిన్ని విశేషాలు:

రాష్ట్రంలో 24 గంటలు కరెంటు ఇస్తున్న ఘనత మా ప్రభుత్వానిది..

పట్టిసీమతో ఇప్పటివరకూ 105 టీఎంసీల నీటిని కృష్ణా జిల్లాకు అందించాం.

రాష్ట్రంలో ఆరోగ్యానికి పెద్ద పీట వేస్తున్నాం.. ఆరోగ్యంతోనే ఆనందం సాధ్యం.

ఎన్టీఆర్ వైద్య సేవలో 1044 వ్యాధులకు చికిత్స అందిస్తున్నాం.

ప్రజల ఆరోగ్యం కాపాడాల్సిన బాధ్యత నాపై ఉంది.

సురక్షితమైన త్రాగునీరు అందిస్తున్నాం. నీటి శుద్ధి కోసం ఇంకా మెరుగైన విధానాలకోసం ప్రయత్నాలు చేస్తున్నాం. కొన్ని విధానాలను పైలెట్ ప్రాజెక్టుగా చేస్తున్నాం..

2019 నాటికి ప్రతి ఇంటికి కూలాయి ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యం..

మొదటగా ఈఏడాది జులై నాటికి కృష్ణా జిల్లాలో ప్రతి ఇంటికి కుళాయి ఇస్తాం..

గ్రామాల్లో డ్రైనేజి సమస్యలను అధిగమిస్తున్నాం..

రాష్ట్రంలో 157 గ్రామాలకు అండర్ గ్రౌండ్ డ్రైనేజి సిస్టం తీసుకువస్తున్నాం..

రాష్ట్రంలో ఉన్న అన్ని పంచాయతీలకు ప్లాటినం రేటింగ్ తీసుకువచ్చే బాధ్యత నాది.. కచ్చితంగా తీసుకువస్తా..

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos