ప్రముఖ టెలికాం దిగ్గజ సంస్థలు జియో, ఎయిర్ టెల్ లకు మరో టెలికాం సంస్థ వొడాఫోన్ షాక్ ఇచ్చింది.  ఇప్పటి వరకు జియో, ఎయిర్ టెల్ సంస్థలు కష్టమర్లను ఆకట్టుకునేందుకు వివిధ రకాల ప్లాన్లను, ఆఫర్లను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ రెండు సంస్థలు ప్రవేశపెట్టని కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ని వొడాఫోన్ తీసుకువచ్చింది.

రూ.21 కే ఓ నూతన ప్రీపెయిడ్‌ ప్లాన్‌ను తాజాగా ప్రవేశపెట్టింది. వొడాఫోన్‌ ప్రీపెయడ్‌ కస్టమర్లు రూ.21 తో రీచార్జి చేసుకుంటే వారు 1 గంట పాటు అన్‌లిమిటెడ్‌ 4జీ లేదా 3జీ మొబైల్‌ డేటాను ఉచితంగా వాడుకోవచ్చు. దీంతో ఎలాంటి వాయిస్‌ కాల్స్‌, ఎస్‌ఎంఎస్‌లు రావు. కేవలం ఇంటర్నెట్‌ బెనిఫిట్ మాత్రమే లభిస్తుంది. ఇక జియోలో ఇదే తరహా ప్లాన్‌ రూ.19 కే లభిస్తుండగా ఇందులో 0.15 జీబీ డేటా మాత్రమే లభిస్తుంది. అన్‌లిమిటెడ్‌ వాయిస్‌ కాల్స్‌, 20 ఎస్‌ఎంఎస్‌లు వస్తాయి. జియో యాప్స్‌ ను ఫ్రీ వాడుకోవచ్చు. ఈ ప్లాన్ వాలిడిటీ 1 రోజు మాత్రమే.