ప్రముఖ టెలికాం సంస్థ వొడాఫోన్ తన కష్టమర్లకు మరో అద్భుతమైన ఆఫర్ తీసుకువచ్చింది. ప్రతి రోజూ  ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 4.5 జీబీ మొబైల్ డేటా అందించనున్నట్లు ప్రకటించింది.  ఇతర టెలికాం సంస్థలు జియో, ఎయిర్ టెల్ లు కష్టమర్లను ఆకట్టుకునేందుకు రోజుకి 1 జీబీ, 1.5 జీబీ అందించే ప్లాన్లను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.

జియో, ఎయిర్ టెల్ ప్లాన్లకు ఆకర్షితులై.. ఎక్కడ తమ కష్టమర్లను నెంబర్ పోర్టబులిటీ పెట్టుకుంటారో అనే భయం వొడా ఫోన్ లో మొదలైంది. అందుకే  తమ కష్టమర్లను ఆకట్టుకునేందుకు ఈ ప్లాన్ తీసుకువచ్చింది. వొడాఫోన్ వినియోగదారులు రూ.799తో రీఛార్జ్ చేసుకుంటే.. 28 రోజుల పాటు రోజుకి 4.5 జీబీ మొబైల్ డేటా లభిస్తుంది. అదేవిధంగా అపరిమిత లోకల్, ఎస్టీడీ కాల్స్, రోజుకి 100 ఎస్ఎంఎస్ లు కూడా లభిస్తాయి.

దీంతోపాటు మరో ప్లాన్ ని కూడా వొడాఫోన్ తీసుకువచ్చింది. రూ.549తో రీఛార్జ్ చేసుకుంటే.. రోజుకి 3.5 జీబీ చొప్పున 28 రోజుల పాటు మొబైల్ డేటా లభిస్తుంది. అంతేకాకుండా అన్ లిమిటెడ్ లోకల్, ఎస్టీడీ కాల్స్, రోజుకి 100 ఎస్ఎంఎస్ లు కూడా లభిస్తాయి.