జియో, ఎయిర్ టెల్ తో పోటీపడుతున్న వొడాఫోన్

Vodafone revises Rs 198 prepaid plan now offers 14GB data per day
Highlights

  • ప్లాన్ అప్ గ్రేడ్ చేసిన వొడాఫోన్
  • జియో, ఎయిర్ టెల్ తో  పోటీపడుతున్న వొడాఫోన్

ప్రముఖ టెలికాం సంస్థ వొడాఫోన్.. వినియోగదారుల కోసం ఓ కొత్త ఆఫర్ ని తీసుకువచ్చింది. ఇప్పటికే ఎయిర్ టెల్, జియో సంస్థలు.. కష్టమర్లను ఆకట్టుకునేందుకు విపరీతంగా ఆఫర్లు ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా.. వాటికి పోటీ ఇచ్చేందుకు రంగంలోకి దిగింది వొడాఫోన్.  ప్రస్తుతం వొడాఫోన్ అందిస్తున్న రూ.198 ప్లాన్ ని అప్ గ్రేడ్ చేసింది. ఇప్పటి వరకు ఈ ప్లాన్‌లో వినియోగదారులకు రోజుకు 1జీబీ డేటా లభించగా ఇప్పుడు దీన్ని 400 ఎంబీ పెంచారు. దీంతో ప్రస్తుతం ఈ ప్లాన్‌లో యూజర్లకు రోజుకు 1.4 జీబీ వరకు మొబైల్ డేటా ఉచితంగా వస్తుంది. ఇక దీంతోపాటు యథావిధిగా ఈ ప్లాన్‌లో కస్టమర్లకు అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్‌టీడీ కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. ఈ ప్లాన్ వాలిడిటీని 28 రోజులుగా నిర్ణయించారు.
 

loader