ప్రముఖ టెలికాం ఆపరేటర్ వొడాఫోన్.. అమేజింగ్ ఆఫర్ ప్రకటించింది. మధ్యప్రదేశ్, ఛతీస్ ఘడ్ రాష్ట్రాల ప్రజలను దృష్టిలో ఉంచుకొని వొడాఫోన్ ఈ ఆఫర్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది. కేవలం రూ.176 తో రీఛార్జ్ చేసుకుంటే.. ప్రతి రోజూ ఒక జీబీ డేటాని పొందవచ్చు. అంతేకాకుండా రోమింగ్ లో కూడా అన్ లిమిటెడ్ కాల్స్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది.

మధ్యప్రదేశ్, ఛతీస్ ఘడ్ రాష్ట్రాల ప్రజలు.. ఈ రెండు రాష్ట్రాల మధ్యలో ఎక్కువ శాతం ప్రయాణం చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఆ రెండు రాష్ట్రాల వినియోగదారులను మరింత ఆకట్టునేందుకు వొడాఫోన్ ఈ చర్యలు చేపట్టింది. ఈ ఆఫర్ ని కనుక  మై వొడాఫోన్ యాప్ నుంచి కనుక వినియోగించుకుంటే.. ఆ సదరు వినియోగదారునికి 5శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా ఉంది. రోజుకి 250 నిమిషాల నొప్పున వారానికి వెయ్యి నిమిషాల కాల్స్  ఉచితంగా చేసుకోవచ్చు. లిమిటెడ్ ఆఫర్ దాటితే నిమిషానికి 30పైసలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.