ప్రముఖ టెలికాం సంస్థ వొడాఫోన్, ఈ-కామర్స్ వెబ్ సైట్ ఫ్లిప్ కార్ట్ లు సంయుక్తంగా ఓ స్మార్ట్ ఫోన్ ని అతి తక్కువ ధరకి అందిస్తున్నాయి. ఇంటెక్స్ ఆక్వా ఏ4 స్మార్ట్ ఫోన్ ని రూ.999కే అందించనున్నట్లు ఈ సంస్థలు అధికారికంగా వెల్లడించాయి. ఫ్లిప్ కార్ట్ లో కొనుగోలు చేస్తే మాత్రమే ఈ ఫోన్ రూ.999కి పొందగలరు. అంతేకాదు.. ఇంకా కొన్ని కండిషన్స్ ఉన్నాయి.

ఈ ఫోన్ ని పొందాలంటే.. వినియోగదారులు ముందుగా రూ.2999 చెల్లించాల్సి ఉంటుంది. అనంతరం అందులో 36 నెలల పాటు నెలకు రూ.150 చొప్పున వొడాఫోన్ ప్లాన్‌ను వాడాల్సి ఉంటుంది. దీంతో 18 నెలల అనంతరం వినియోగదారులకు రూ.900 క్యాష్ బ్యాక్ వస్తుంది. అలాగే మరో 18 నెలల అనంతరం రూ.1100 క్యాష్ బ్యాక్ వస్తుంది. దీంతో మొత్తం క్యాష్ బ్యాక్ కలిపి రూ.2వేలు అవుతుంది. ఈ క్రమంలో ఫోన్ ధర రూ.999 అవుతుంది. 

వొడాఫోన్, ఫ్లిప్‌కార్ట్‌ లు అందిస్తున్న ఈ ఇంటెక్స్ ఆక్వా ఎ4 స్మార్ట్‌ ఫోన్‌లో 4 ఇంచ్ డిస్‌ప్లే, 1.3 గిగాహెడ్జ్ క్వాడ్ కోర్ ప్రాసెస‌ర్‌, 1 జీబీ ర్యామ్‌, 8 జీబీ స్టోరేజ్‌, డ్యుయ‌ల్ సిమ్‌, ఆండ్రాయిడ్ 7.0 నూగ‌ట్‌, 5 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా, వీజీఏ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, 1750 ఎంఏహెచ్ బ్యాట‌రీ త‌దిత‌ర ఫీచ‌ర్లు ఉన్నాయి.