మార్కెట్లోకి మరో బడ్జెట్ స్మార్ట్ ఫోన్

Vivo unveils the new Y71 at Rs 10,990
Highlights

వివో నుంచి అదిరిపోయే ఫీచర్లతో బడ్జెట్ స్మార్ట్ ఫోన్

చైనాకి చెందిన ప్రముఖ ఎలెక్ట్రానిక్ వస్తువుల తయారీ సంస్థ  వివో.. భారత మార్కెట్లోకి మరో స్మార్ట్ ఫోన్ ని విడుదల చేసింది. బడ్జెట్ ధరలోనే ఈ స్మార్ట్ ఫోన్ ని అందజేస్తున్నట్లు తెలిపింది.వై సిరీస్‌లో ‘వివో వై 71’  పేరుతో బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. మాట్ట్ బ్లాక్ అండ్‌ గోల్డ్‌ కలర్స్‌లో  విడుదలైన ఈ డివైస్‌ ధర రూ.10,990గా కంపెనీ నిర్ణయించింది.   ఏప్రిల్‌ 14 నుంచి అన్ని ఆఫ్‌లైన్‌ విక్రయ కేంద్రాల్లో విక్రయిస్తామని వివో సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.  అలాగే వివో ఇ-స్టోర్‌, ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌, పేటీఎంమాల్ ద్వారా  ఏప్రిల్‌ 16 నుంచి అందుబాటులో ఉంటాయని  వెల్లడించింది. భారీ డిస్ ప్లేతో ఈ ఫోన్ తయారు చేసినట్లు కంపెనీ తెలిపింది. అంతేకాకుండా గత మోడల్స్ తో పోలిస్తే.. మరింత మెరుగైన పనితీరుతో దీనిని అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు.

వివో వై71 ఫోన్ ఫీచర్లు...
6 అంగుళాలఫుల్‌వ్యూ డిస్‌ప్లే  84.4 శాతం స్క్రీన్ బాడీరేషియో
క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ 425 చిప్‌సెట్‌
ఆండ్రాయిడ్‌ 8.1 ఓరియో
3జీబీ ర్యామ్‌, 16జీబీ స్టోరేజ్‌ 
256 జీబీ దాకా స్టోరేజ్‌ను విస్తరించుకునే అవకాశం
13ఎంపీ  హై డెఫినిషన్ వెనుక కెమెరా
5ఎంపీ సెల్ఫీ కెమెరా
3360 ఎంఏహెచ్‌ బ్యాటరీ

loader