ప్రముఖ ఈ-కామర్స్ వెబ్ సైట్ అమేజాన్ మరో డిస్కౌంట్ సేల్ కి తెరలేపింది. వివో కార్నివల్ పేరిట సేల్ ని ప్రారంభించింది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా వివో, అమేజాన్ సంయుక్తంగా ఈ డిస్కౌంట్ సేల్ ని  ప్రారంభించాయి. ఫిబ్రవరి 12వ తేదీ నుంచి 14వ తేదీ వరకు మాత్రమే ఈ ఆఫర్లు వర్తిస్తాయి. వివో వి7 ప్లస్‌, వివో వి7, వివో వి5 ప్లస్‌, వివో వి5 ఎస్‌, వివో వై69, వివో వై66, వివో వై55 ఎస్‌, వివో వై53 స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్లు అందించనున్నట్లు వివో పేర్కొంది. 

 

ఈ కార్నివల్‌ సేల్‌లో భాగంగా ఆన్‌లైన్‌లో విక్రయించనున్న వివో మోడళ్లలో వివో వి7 ప్లస్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది. ఇది రూ.22,990కు లభించనుంది. అలాగే రూ. 18,990 విలువ గల వివో వి7 16,990కే లభించనుంది. రూ. 25,990గా ఉన్న వివో వి5 ప్లస్‌ ఈ కార్నివల్‌లో రూ. 19,990కే కొనుగోలు చేయవచ్చు. వివో వి5 ఎస్‌పై రూ.3 వేల డిస్కౌంట్‌తో రూ.15,990కే లభిస్తోంది. వివో వై సిరీస్‌లో ఉన్న వై69, వై55 ఎస్‌, వై53లపై రూ. 1000 వరకు డిస్కౌంట్‌ అందిస్తోంది. ఎక్స్ఛేంజీ ఆఫర్‌ కింద నిబంధనలకు లోబడి వి5 ప్లస్‌పై రూ. 3 వేలు, వి5 ఎస్‌, వై69పై రూ.2,500, వి7, వి7 ప్లస్‌పై రూ. 2 వేలు, వై55 ఎస్‌, వై 53పై రూ. 1,500, వై66పై రూ.4 వేలు  డిస్కౌంటును వివో అందిస్తోంది.