వివో వి5 ప్ల‌స్ ధ‌ర భారీగా త‌గ్గించింది

vivi v5 pluse phone has reduce the rate
Highlights

  • వివో వి5 ప్లస్ ఫోన్ పై భారీ తగ్గింపు
  • 5000 తగ్గించింది
  • నేటి నుండే అమలు

ఐపీఎల్ టైటిల్ స్పాన్స‌ర్ గా భార‌త మార్కేట్ లోకి దూసుకొచ్చిన ఫోన్ వివో. అయితే కెమెరా ప్ర‌త్కేక‌త‌తో మార్కెట్ లోకి వ‌చ్చింది ఈ ఫోన్‌. అయితే వివో వీ5 ప్లస్ స్మార్ట్‌ఫోన్ ధరను భారీగా తగ్గించింది. ఈ ఫోన్‌పై ఏకంగా రూ. 5వేల తగ్గిస్తున్నట్టు పేర్కొంది.

 వివో వి5 ఫోన్ ధ‌ర‌ రూ.27,980. ప్ర‌స్తుతం ఈ ఫోన్ ధర 22,999కు త‌గ్గింది. ఈ ఏడాది మొదట్లో వీ5 ప్లస్ మార్కెట్లోకి వచ్చింది. సెల్ఫీలంటే మోజు పడేవారికి ప్రత్యేకంగా ఈ ఫోన్‌లో రెండు డ్యూయల్ కెమెరాలు అమర్చారు. ముందు వైపు 20 ఎంపీ, 8 ఎంపీ కెమెరాలుండగా వెనకవైపు 16 మెగాపిక్సల్ కెమెరా ఉంది. 5.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్, ఫింగర్ ప్రింట్ స్కానర్, 3055 ఎంఏహెచ్ బ్యాటరీ, 4జీబీ ర్యామ్‌, 64జీబీ ఇన్‌బిల్ట్ మెమొరీ, ఆండ్రాయిడ్‌ 6.0 ఓఎస్ తదితర ఫీచర్లు వీ5 ప్లస్‌లో ఉన్నాయి. 

ఈ ఫోన్ ప్ర‌స్తుతం స్టోర్ లో కాకుండా ఆన్‌లైన్ లో కూడా దొరుకుతుంది. నేటి నుండి ఈ ఫోన్ ధ‌ర త‌గ్గించిన‌ట్లు వివో త‌న ఆఫిషియ‌ల్ పేజీలో ప్రక‌టించారు.
 

loader