కాల్పుల ఘనతో ఉలికిపడిన వర్జీనియా వర్జీనియా వర్సిటీలో కాల్పులు జిరిపిన దుండగుడు
అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. వర్జీనియా స్టేట్ యూనివర్సిటీలో కాల్పులు చోటుచేసుకున్నాయి. వర్సిటీ ప్రాంగణంలోకి చొరబడిన దుండగుడు కాల్పులు జరిపాడు. దీంతో పోలీసులు క్యాంపస్‌ను మూసేసి.. ఆ ప్రాంతాన్నంతా ఖాళీ చేయించారు. అటువైపుగా ఎవరూ రావొద్దని సామాజిక మాధ్యమాల ద్వారా హెచ్చరికలు జారీ చేశారు. ఈ కాల్పుల ఘటనలో ఒకరు గాయపడినట్లు సమాచారం. వర్సిటీకి చేరుకున్న పోలీసులు కాల్పులు జరిపిన దుండగుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆ వర్సిటీలో ఎవరైనా తెలుగు ప్రజలు ఉన్నారేమో అనే సందేహాలు కలుగుతున్నాయి. ఈ విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.
గత కొద్ది రోజుల క్రితం లాస్ వెగాస్ లో ఓ సంగీత కార్యక్రమం జరుగుతుండగా దుండగుడు విచక్షణా రహితంగా కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 60మందికి పైగా మృత్యువాతపడగా.. వందల మంది గాయపడ్డారు.
