మా అక్కను మిస్ అవుతున్నా..కొహ్లీ

Virat Kohlis Raksha Bandhan Post For His Didi Is The Sweetest
Highlights

  • ఈ రాఖీ రోజున తన అక్కని మిస్ అవుతున్నా
  • అక్కతో కలిసి దిగిన ఫోటోని కూడా విరాట్  సోషల్ మీడియాలో పోస్టు చేశారు

 

ఈరోజు రాఖీ పౌర్ణమి. ప్రపంచ వ్యాప్తంగా సోదరీమణులంతా.. తమ సోదరులకు రాఖీ కట్టి.. తమ ప్రేమను చాటుకుంటున్నారు. కాగా..  తాను మాత్రం ఈ రాఖీ రోజున తన అక్కని మిస్ అవుతున్నానని భారత క్రికెట్ కెప్టెన్  విరాట్  తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా రాఖీ పండగను జరుపుకుంటున్న అందరూ సోదరీ సోదరీమణులకు విరాట్ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ రాఖీ రోజున తాను తన అక్కని, కుటుంబాన్ని మిస్ అవుతున్నాని విరాట్ సోషల్  మీడియాలో పేర్కొన్నారు. తన అక్కతో కలిసి దిగిన ఫోటోని కూడా విరాట్  సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఫేస్ బుక్ లో ఆయన పెట్టిన పోస్టుకు అరగంటలో 57వేల మంది లైక్ చేయగా.. ఇన్ స్ట్రాగ్రామ్ లో పెట్టగా..1.5 లక్షల మంది లైక్ చేశారు.

కొహ్లీ పోస్టుకు నెటిజన్ల నుంచి  అనుహ్య స్పందన వస్తోంది. ‘ నీకు.. మీ అక్కకి.. రాఖీ పండుగ శుభాకాంక్షలు. ఇంతే సంతోషంగా మీ భవిష్యత్తు ఉండాలని..  దేవుని ఆశీస్సులు మీ వెంట ఎప్పుడూ ఉంటాయం’టూ ఓ అభిమాని కొహ్లీ పోస్టుకు కామెంట్ చేశాడు.

loader