చాలా మంది పురుషులను నపుంశకులుగా మార్చేవాడట. దేవ కార్యం పేరుతో మహిళలను లోభరుచుకునేవాడు. అత్తింటివారు కట్నం కోసం వేధిస్తున్నారని హనీప్రీత్‌ గుర్మీత్‌ను ఆశ్రయించడంతో ఆమెను దత్తత తీసుకున్నారు
డేరా స్వచ్ఛ సౌద అధినేత గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్... ఈ పేరు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మార్మోగిపోతోంది. ఇద్దరు సాధ్విలను అత్యాచారం చేసిన కేసులో ఆయనకు సీబీఐ ప్రత్యేక కోర్టు.. 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది.
కేవలం ఈ సంఘటన మాత్రమే కాకుండా బాబా అనే పేరు ముసుగులో ఆయన చేసిన దారుణాలు అన్నీ.. ఇన్నీ కాదు. చాలా మంది పురుషులను నపుంశకులుగా మార్చేవాడట. దేవ కార్యం పేరుతో మహిళలను లోభరుచుకునేవాడు. గుర్మీత్ అరెస్టు తర్వాత ఇలాంటి ఒక్కో సంఘటన వెలుగులోకి వస్తోంది. కాగా.. ప్రతి పురుషుడి విజయం వెనుక ఓ మహిళ ఉంటుంది అనే నానుడి ఉంది. అలాగే ఎన్నో దారుణాలకు పాల్పడిన బా బా గుర్మీత్ వెనుక కూడా ఒకరు కాదు ఇద్దరు మహిళలు ఉన్నారు. వారే... విపాసన, హనీ ప్రీత్. ఇంత కాలం.. గుర్మీత్ ని వెనుకనుంచి నడిపించింది.. ఈ ఇద్దరు మహిళలే.
అసలు ఏవరీ విపాసన, హనీ ప్రీత్..
వివాహిత అయిన హనీప్రీత్ని గుర్మీత్ 2009లో దత్తత తీసుకున్నారు. ఆమె అసలు పేరు ప్రియాంక తనేజా. ఆమె స్వస్థలం ఉత్తర్ప్రదేశ్లోని ఫతేపూర్. అత్తింటివారు కట్నం కోసం వేధిస్తున్నారని హనీప్రీత్ గుర్మీత్ను ఆశ్రయించడంతో ఆమెను దత్తత తీసుకున్నారు. ఆయన నటించే సినిమాల్లో హనీప్రీత్కు అవకాశాలు ఇచ్చేవారు. కాగా.. ఆమె అసలు ఆయన దత్త పుత్రిక అనేది పచ్చి అబద్ధం అని బాబాకు గతంలో అంగరక్షకుడిగా పనిచేసిన బియాంత్ సింగ్ చెబుతున్నారు. ఆమె గుర్మీత్ ఇష్టమైన సహచరి అని ఆయన చెప్పారు.
కాగా.. హనీ ప్రీత్ మాత్రం సోషల్ మీడియాలో ‘ పప్పా ఏంజెల్’, డైరెక్టర్, నటి, ఎడిటర్ గా ఆమెను ఆమె పరిచయం చేసుకున్నారు. అంతేకాదు.. హనీప్రీత్ కి ట్విట్టర్ లో మిలియన్ల మంది ఫాలోవర్లు... ఫేస్ బుక్ లో 5లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. గుర్మీత్ 50వ పుట్టిన రోజు నాడు ఆయనకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు కూడా తెలిపారు. డేరా బాబా తీసిన ‘ఎంఎస్ జీ’ సినిమాలోనూ హనీ నటించారు.
విపాసన కూడా గుర్మీత్ వెంటనే ఉంటూ.. ఆయన కార్యకలాపాలను చూస్తూ ఉండేది. అంతేకాకుండా డేరా కాలేజీ కి ఛైర్ పర్సన్ గా వ్యవహరిస్తున్నారు. డేరా ముఖ్య అనుచరుల్లో రెండో స్థానం విపాసనదే.
హనీప్రీత్, విపాసన లు ఇద్దరూ తమని తాము గురు బ్రహ్మచారిణిలుగా పిలిపించుకునేవారు.
గుర్మీత్ రామ్ రహీమ్ కి భార్య హర్జీత్ కౌర్, కుమార్తెలు.. చరణ్ ప్రీత్, అమన్ ప్రీత్, కుమారుడు జస్మీత్ లు ఉన్నారు. ఇద్దరు కుమార్తెలు.. ఒక కొడుకు ఉన్నప్పటికీ.. వారి కన్నా.. ఆయన ఎక్కువ ప్రాధాన్యం హనీప్రీత్, విపాసనలే ఇచ్చేవారు.
