Asianet News TeluguAsianet News Telugu

విజ‌య‌వాడ అమ్మాయి బోయింగ్ 777 ను క‌మాండ్ చేస్తుంది

  • బోయింగ్777 కు ప్రపంచంలోనే అతి పిన్న వయస్సురాలైనా కమాండర్.
  • విజయవాడకు చెందిన దివ్య నియామకం.
  • దేశం గర్విస్తుందని ప్రచురించిన సీఎన్ఎన్ పత్రిక
vijaywada lady commanding boeing 777

 బోయింగ్ 777 ప్ర‌పంచ వ్యాప్తంగా చాలా ప్ర‌త్యేక‌త‌ క‌ల్గిన విమానం. ఇక ఆ విమానం క‌మాండ‌ర్ గా ప‌నిచేయడం అంటే చాలా గొప్ప‌గా భావిస్తారు. కానీ విజ‌యవాడకు చెందిన దివ్య‌ ఆ విమానానికి క‌మాండ‌ర్ గా ప‌ద‌వి బాధ్యతలు చేప‌ట్టారు.  


బోయింగ్ 777 కి క‌మాండ‌ర్ అంటే అది సాధార‌ణ విష‌యం కాదు, ఏంతో అనుభ‌వం ఉంటే త‌ప్పా ఆ ప‌ద‌విని చేరుకోవ‌డం అంత సులువు కాదు. అందులో అమ్మాయిలకు అయితే మ‌రీ క‌ష్టం. కానీ అన్నీ దివ్య క‌మాండ‌ర్ గా భాద్య‌త‌లు చేపట్టారు. దివ్య తండ్రి ఆర్మీ ఆఫీస‌ర్. ఒక ప్రాంతంలో నివాసం ఉండేవారు కాదు, కానీ కొంత కాలానికి తన స్వంత న‌గ‌రం అయినా విజ‌య‌వాడ‌కు చేరుకున్నారు. అక్క‌డే ఆమె కేంద్రీయ విద్యాలయలో చదువుకున్నారు. స్కూల్ చ‌దువు త‌రువాత ఇంట‌ర్, బీటెక్ కూడా విజ‌య‌వాడ‌లో చ‌దివారు. 

 ఆమెకు చిన్న‌నాటి నుండి ఉన్న కోరిక ఫైల‌ట్ అవ్వ‌డం. అందుకు 17 సంవ‌త్స‌రాల నుండి త‌న ప్ర‌య‌త్నాల‌ను ప్రారంభించింది దివ్య‌. మొద‌ట త‌న తండ్రి వ‌ద్ద‌ని వారించేవారు. కానీ ఇందిరా గాంధీ రాష్ట్రీయ ఉరాన్ అకాడమీ లో సీటు వ‌చ్చింది. ఇందులో దేశ వ్యాప్తంగా కేవ‌లం 30 మందిని మాత్ర‌మే ఏంపిక ఉంటుంది. అందులో దివ్య పేరు చూశాకా.. దివ్య తండ్రి వద్ద‌న‌లేక‌పోయారు. ఇక ఆమె తల్లి మాత్రం దివ్య‌ను ఎల‌గైనా ఫైల‌ట్ ను చెయ్యాల‌ని కృత‌నిశ్చ‌యంతో ఉండేది. 


21 సంవ‌త్స‌రాల వ‌య‌స్సులో దివ్య ఫైల‌ట్ గా ఉద్యోగం సంపాధించింది. ఇక ఆమె వెన‌క్కి తిరిగి చూసుకోలేదు. దివ్య ఇప్పుడు ప్ర‌పంచంలోనే అత్యంత పిన్న వ‌య‌స్సులో బోయింగ్ 777 క‌మాండ‌ర్ గా భాద్య‌త‌లు చెపట్టింది. 

ఆమె మాట్లాడుతూ త‌ను నిజంగా న‌మ్మ‌లేకుండా ఉన్నాన‌ని, త‌ను ఈ స్థాయికి రావ‌డానికి కార‌ణం త‌ల్లిదండ్రుగా ఆమె తెలిపింది. మొద‌ట  ఇంగ్లీషు చాలా స‌మ‌స్య‌గా ఉండేద‌ని, చివ‌ర‌కు ఆ స‌మ‌స్య‌ను అధిగ‌మించానని ఆమె పెర్కొన్నారు. దివ్య‌ను చూసి దేశం అంతా గ‌ర్వ‌ప‌డుతుంద‌ని సీఎన్ఎన్ తాజా సంచిక‌లో ప్ర‌చురించింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios