విజయవాడ రౌడీషీటర్ హత్యకేసులో వీడిన సస్పెన్స్

First Published 15, Dec 2017, 3:48 PM IST
vijayawada rowdy sheeter murder case
Highlights
  • విజయవాడ రౌడీషీటర్ హత్య కేసులో నిందితుల అరెస్ట్
  • నిందితుల వివరాలు వెల్లడించిన సిపి

విజయవాడ లో సంచలనం సృష్టించిన కాళిదాసు సుబ్రమణ్యం అలియాస్ సుబ్బు హత్య కేసును పోలీసులు చేధించారు.ఈ హత్యలో పాలుపంచుకున్న 9 మంది నిందుతులను అరెస్ట్ చేసిన పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందన్భంగా సిపి గౌతమ్ సవాంగ్ నిందితుల వివరాలను తెలియజేశారు. ఈ 9మంది నిందితులు  గుంటూరు జిల్లాకు చెందిన వారని, పాతకక్షల నేపథ్యంలోనే ఈ హత్య చేశారని పేర్కొన్నారు. ఇదివరకే వీరిలో పలువురిపై కేసులు నమోదై రౌడీషీట్ లు కూడా ఓపెనై ఉన్నాయని సిపి తెలిపారు.

ఈ తొమ్మిదిమంది నిందితుల వివరాలిలా ఉన్నాయి.

1) గడ్డేటి బాల భాస్కర్ (రౌడి షీటర్)

2) నూకలపాటి అరుణ్ కుమార్

3) సముద్రాల పవన్ కుమార్ (రౌడి షీటర్)

4 అదంకి సుధాకర్ (రౌడి షీటర్)

5 తోమటి నాగరాజు (రౌడి షీటర్)

6 గడ్డేటి సురేంద్ర ( రౌడి షీటర్)

7 వజ్రాల బాబు (రౌడి షీటర్)

8 కమేపల్లి లక్ష్మయ్య (రౌడి షీటర్)

9 మహ్మద్ గాలిబ్(గుంటూరు జిల్లా తెల్లప్రోలు)

loader