విజయవాడలో మాయమయిన  డాక్టర్ గురించి ఫిర్యాదు అందుకున్న పోలీసులు

బెజవాడ చెందిన డాక్టర్ అదృశ్యం వెనుక ఒక మాజి ఎం.ల్.ఏ కుమారుడి హస్తం ఉందని ఆమె తల్లీ తండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

డాక్టర్ మూడు రోజుల కిందట మాయమయిన సంగతి తెలిసిందే.

మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసముంటున్న డాక్టర్ స్వరూప విసన్నపేట మండలం తెల్ల దేవరపల్లి లో డాక్టర్ గా పనిచేస్తోంది.

మూడు రోజుల క్రితం స్వరూప కనిపించడం లేదు.గత కొన్ని రోజులుగా మాజీ ఎం.ల్.ఏ కుమారుడు విద్యాసాగర్ తో సన్నిహితంగా వుండేవారు అని స్వరూప తల్లీ తండ్రులు అనుమానం వ్యక్తం చేశారు.ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ మాచవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐ.ఏ.ఎస్ చెందిన వ్యక్తి కావడంతో వివరాలు వెల్లడించేందుకు పోలీసులు నిరాకరిస్తున్నారు...