నిన్న అమూల్ బేబీ.. నేడు లిక్కర్ కింగ్

First Published 9, Dec 2016, 9:01 AM IST
Vijay Mallyas twitter account hacked
Highlights
  • విజయ్ మాల్యా ట్విటర్ అకౌంట్ హ్యాక్
  • బ్యాంకులకు ఆయన ఎగ్గొట్టిన డబ్బులపై ట్వీట్లు

హ్యాకర్లు కూడా సెలబ్రెటీలను భలేగా టార్గెట్ చేస్తున్నారు. నిన్న కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ ట్విటర్ అకౌంట్ ను హ్యాక్ చేసి కాంగ్రెస్ పైన అదే ట్విటర్లో సెటైర్లు వేసిన హ్యాకర్లు ఈ రోజు మరోసారి ఇంకో సెలబ్రెటీపై పడ్డారు.

 

బ్యాంకులకు వేల కోట్ల రూపాయిలు ఎగ్గొట్టి లండన్ కు పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ మాల్యా ట్విటర్ పై ఈసారి హ్యాకర్లు విరుచుకపడ్డారు.

 

తన ట్విటర్ హ్యాక్ అయినట్లు విజయ మాల్యా కూడా ప్రకటించారు.  'నా ఇ-మెయిల్ అకౌంట్ల హ్యాక్ చేసి బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు' అని ఆయన ఆవేదన కూడా వ్యక్తం చేశారు.

 

అయితే మాల్యా ట్విటర్ ను హ్యాక్ చేసిన వారు అంతటితో ఊరుకోకుండా ఒక మంచి పని కూడ చేశారు. లిక్కర్ కింగ్ ఏ ఏ బ్యాంకులకు ఎన్ని వేల కోట్లు ఎగ్గొట్టారో లెక్కలతో సహా ఆయన ట్విటర్ అకౌంట్ లోనే పోస్టు చేయడం గమనార్హం.

loader