ఇన్‌స్టాగ్రాంలో అద్భుతమైన ఫీచర్

Video calling might be coming to Instagram
Highlights

  • ఇన్ స్టాగ్రామ్ లో  త్వరలో కొత్త ఫీచర్
  • వీడియో కాలింగ్ సదుపాయం కల్పించనున్న ఇన్ స్టాగ్రామ్

ప్రముఖ సోషల్ మీడియా వెబ్ సైట్ ఫేస్ బుక్ కి చెందిన యాప్ ఇన్‌స్టాగ్రాంలో సరికొత్త ఫీచర్ ని తీసుకువస్తున్నారు.  ఇప్పటి వరకు ఇన్‌స్టాగ్రాంలో ఫోటోలు, వీడియోలు మాత్రమే షేర్ చేసుకోగలిగేవాళ్లం. అయితే.. ఇక నుంచి వీడియో కాల్స్ చేసుకోవచ్చు. దీని కోసం కసరత్తులు మొదలుపెట్టారు. మరి కొద్ది రోజుల్లో ఈ ఫీచర్ ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు.

ఇందుకు గాను యాప్‌లో యాక్టివ్‌గా ఉన్న యూజర్ చాట్‌పై ప్రెస్ చేస్తే వీడియో కాల్ ఆప్షన్ దర్శనమిస్తుంది. దీంతో వీడియో కాలింగ్ చేసుకోవచ్చు. అయితే ఇలా వీడియో కాల్ చేయాలంటే అవతలి వైపు ఉన్న యూజర్ మొదట ఆ కాల్ రిక్వెస్ట్‌ను యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. అలా చేస్తేనే ఇద్దరూ ఇన్‌స్టాగ్రాంలో వీడియో కాల్స్ చేసుకోవచ్చు. వినియోగదారులను మరింత ఆకట్టుకునేందుకు ఈ ఫీచర్ ని అందుబాటులోకి తీసుకువస్తోంది.

loader