తెలంగాణలో  తెలుగు పాఠ్యాంశం తప్పనిసరిచేసినందుకు ముఖ్యమంత్రికి ఉపరాష్ట్రపతి అభినందనలు

ముఖ్యమంత్రి కెసిఆర్ తెలుగును ప్రోత్సహించేందుకు తీసుకున్న చర్యలకు ప్రశంసలందుతున్నాయి. ఉపరాష్ట్రపతి ఎమ్. వెంకయ్య నాయుడు నుంచి తొలి అభినందనలు అందాయి. ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు తెలుగు భాష బోధనను తప్పనిసరి చేయాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం పట్ల కెసిఆర్‌కు అభినందనలు తెలుపుతూ వెంకయ్య ట్వీట్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం నిర్ణయాన్ని తాను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఇతర రాష్ట్రాలు కూడా తెలంగాణను ఆదర్శంగా తీసుకోవాలని సూచిస్తూ మాతృభాషకు ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు.

Scroll to load tweet…
Scroll to load tweet…