ప్రేమికుల రోజుపై ప్రవీణ్ తొగాడియా సంచలన వ్యాఖ్యలు

ప్రేమికుల రోజుపై ప్రవీణ్ తొగాడియా సంచలన వ్యాఖ్యలు

మరో రెండు రోజుల్లో ప్రేమికుల రోజు( వాలంటైన్స్ డే) రానుంది. ఒక వైపు ప్రేమికుల రోజుని ఏలా జరుపుకోవాలా అని ప్రేమికులు ఆలోచిస్తుంటే.. ఆ వేడుకలను ఎలా అడ్డుకోవాలా అని  విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ కార్యకర్తలు ఆలోచిస్తూ ఉన్నారు.  వాలంటైన్స్ డే లాంటి  పాశ్చాత్య విష సంస్కృతి కారణంగా భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు వ్యతిరేకమని, వాటిని నిషేధించాలని ఇప్పటికే భజరంగ్ దళ్  కార్యకర్తలు డిమాండ్ కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వీహెచ్‌పీ అంతర్జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రవీణ్ తొగాడియా  చేసిన వ్యాఖ్యలు అందరినీ అయోమయానికి గురి చేశాయి. 

చండీగఢ్‌లో ప్రేమికుల రోజు సందర్భంగా  విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. 'యువతీ యువకులు ప్రేమలో పడకపోతే పెళ్లిళ్లు జరగవు. ఒక వేళ వివాహాలు జరగకపోతే ప్రపంచం పురోగమించదు. యుక్త వయస్సులో ఉన్న యువతీ యువకులకు ప్రేమించుకునే హక్కు ఉంది. వాళ్లు ఆ హక్కును వినియోగించుకోవాలని' తొగాడియా వ్యాఖ్యానించారు. మన కూతుళ్లు, సోదరీమణులకు ప్రేమించుకునే హక్కు ఉందనే సందేశాన్ని వ్యాప్తి చేస్తానని అన్నారు. ఆయన వ్యాఖ్యాలను విన్న వీహెచ్ పీ నేతలు, కార్యకర్తలు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos