Asianet News TeluguAsianet News Telugu

వేలంలో జగ్గారెడ్డి బ్రేస్ లెట్ ధర రూ. 20 లక్షలు

వేలంలో జగ్గారెడ్డి బ్రేస్ లెట్ ధర రూ. 20 లక్షలు పలికింది.మరొక నాయకుడు గీరెడ్డి మహేందర్ రెడ్డి బ్రేస్ లెట్ ను కొన్నారు.కొద్ది సేపటి కిందట కాంగ్రెస్ నాయకుడు  జగ్గారెడ్డి సోమాజీ గూడ ప్రెస్ క్లబ్ లో వేలం వేశారు.  సంగారెడ్డి లో కాంగ్రెస్  ప్రజాగర్జన విజయవంతమయినందుకు మాజీ ఎంపి వి హనుమంతరావు  ఈ బ్రేస్ లెట్ ను జగ్గారెడ్డి కి  బహూకరించారు.

VH bracelet fetches Rs 20 lakh for Jagga Reddy in auction

వేలంలో జగ్గారెడ్డి బ్రేస్ లెట్ ధర రూ. 20 లక్షలు పలికింది.

  కృషి బిల్డర్స్ యాజమాని గీరెడ్డి మహేందర్ రెడ్డి బ్రేస్ లెట్ ను కొన్నారు.

కొద్ది సేపటి కిందట ఈ బ్రేస్ లెట్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు  జగ్గారెడ్డి సోమాజీ గూడ ప్రెస్ క్లబ్ లో వేలం వేశారు.

సంగారెడ్డి లో జూన్ 1 వ తేదీన జరిగిన తెలంగాణ ప్రజా గర్జన విజయవంతం ఆయిన సందర్బంగా సమావేశ నిర్వాహకుడు జగ్గారెడ్డికి మాజీ రాజ్యసభ ఎంపీ హనుమంతరావు    బ్రేస్ లెట్ ను బహుకరించారు.

సంగారెడ్డి సభకి కాంగ్రెస్ ఉపాధ్యక్సుడు  రాహుల్ గాంధీ రావడం, మాట్లాడటం జరిగింది. ఇంత పెద్ద సభని చూసి  ఆయన సంతోషించారు. ప్రశంసించారు.

సభ ఏర్పాట్ల వెనక ఉన్న జగ్గారెడ్డి  గురించి  హనుమంతరావు  రాహుల్ గాంధీకి రెండు సార్లు చెప్పడం జరిగింది.

"అప్పుడు రాహుల్ గాంధీ, మరి  నీ కంట్రిబ్యూషన్ ఏమిటి అడిగారు.   నా దగ్గర ఆస్తులు ఏమి లేవు కాబట్టి నా బ్రేస్ లెట్ ఇస్తాను అని  హనుమంతరావు అన్నారు. అలా నాకు ఇచ్చిన ఈ బ్రేస్ లెట్ ని వేలం వేసి ఖమ్మం లో అరెస్టు అయి  నష్టపోయిన రైతులకి విరాళం గా ఇద్దామని అనుకున్నాను," అని వేలం తర్వాత జగ్గారెడ్డి అన్నారు.

‘‘నేను కుడా రైతు కుటుంబం నుంచి ఎదిగాను.నెను రైతు బిడ్డనే .అందుకే రైతుల కోసం వేలం పాట అనగానే వెనకాడకుండా వచ్చి 20 లక్షలకి పాడటం జరిగింది’’ అని బ్రేస్ లెట్ కొన్న మహేందర్ రెడ్డి అన్నారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios