ఈ నెల 21వ తేదీన రాజ్ భవన్ లో ఆయనను సన్మానించనున్నారు దిల్ కుషా అతిథి గృహంలో వెంకయ్యనాయుడికి విందు భోజనం కూడా ఏర్పాటు చేశారు

ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడికి తెలంగాణ ప్రభుత్వం పౌరసన్మానం చేయనుంది. తెలంగాణ ప్రజలు, ప్రభుత్వం తరపున ఈ నెల 21వ తేదీన రాజ్ భవన్ లో ఆయనను సన్మానించనున్నారు. ఇదే విషయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వాతంత్య్ర దినోత్సవం రోజున రాజ్ భవన్ లో జరిగిన ఎట్ హోమ్ కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్ కి తెలియజేసినట్లు సమాచారం.

ఈ నెల 11న ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. తొలుత ఈ కార్యక్రమానికి కేసీఆర్ హాజరుకవాలనుకున్నారు. కానీ.. కొన్ని అనివార్య కారణాల కారణంగా హాజరు కాలేదు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య పేరును ప్రకటించినప్పటి నుంచి ఆయనకు టీఆర్ఎస్ పార్టీ మద్దతుగా నిలిచింది. ఎన్నికల్లోనూ ఆయనకే ఓట్లు కూడా వేశారు.ఈ నేపథ్యంలో ఈ పౌర సన్మాన కార్యక్రమాన్ని చేపట్టారు. సన్మానం అనంతరం దిల్ కుషా అతిథి గృహంలో వెంకయ్యనాయుడికి విందు భోజనం కూడా ఏర్పాటు చేశారు.