Asianet News TeluguAsianet News Telugu

సుప్రీంకోర్టును వదల్లేదు

  • జాతీయగీతం థియేటర్లలో ప్రసారం చేయాలన్న అత్యున్నత న్యాయస్థానం
  • సుప్రీం కోర్టు తీర్పుపై ట్విట్టర్ లో సెటైర్ వేసిన వర్మ
varma tweets on supreme courts

వర్మ సినిమాలే కాదు.. ఆయన ట్వీట్లు కూడా హాట్ గానే ఉంటాయి. భారత రాజ్యాంగ పీఠికలో ఉన్న స్వేచ్చ, సమానత్వం, సౌభ్రాతృత్వం నిజంగా దేశంలో ఉన్నాయా లేవో తెలియవు కానీ, ఆయన ట్విట్టర్ లో మాత్రం ఉంటాయి.

 

ట్విట్టర్ లో  ఆయనకు అందరూ సమానమే.. కామన్ మెన్ నుంచి చీఫ్ మినిస్టర్ వరకు అందరినీ తన ట్వీట్లతో కొడుతుంటారు.

 

ఇప్పడు ఆయన ఏకంగా సుప్రీం కోర్టుపైనే ట్వీట్ వదిలాడు. అదికూడా చాలా సెటైర్లు వేస్తూ...తాజాగా సుప్రీం కోర్టు  సినిమా థియేటర్లలో జాతీయగీతాన్ని తప్పనిసరిగా ప్రసారం చేయాలని తీర్పు నిచ్చింది.

 

ఎందుకో ఈ విషయం వర్మకు చిరాకు తెప్పించింది.  ‘జాతీయగీతం థియేటర్లలోనే ఎందుకు ప్రసారం చేయాలి? కస్టమర్లు దుకాణంలో అడుగుపెట్టే ముందు జాతీయగీతం ప్రసారం చేశాకే లోపలికి ఎందుకు వెళ్లకూడదు? ప్రతి టీవీ ప్రోగ్రాం, టీవీ సీరియల్‌ ఎపిసోడ్‌, రేడియో ప్రోగ్రాంలు ఆరంభంలో జాతీయగీతాన్ని ఎందుకు ప్రసారం చేయకూడదు? వార్తలు అందించే ముందు టీవీలో ఎందుకు జాతీయ గీతాన్ని ప్రసారం చేయకూడదు?

 

తల్లిదండ్రులు, పిల్లలు ఉదయాన్నే నిద్రలేవగానే జాతీయగీతం పాడి దినచర్య ప్రారంభించకూడదా? అన్ని మతాల ప్రార్థనాలయాల్లో ప్రార్థనలకు ముందుగా జాతీయగీతాన్ని ప్రసారం చేయకూడదా? నైట్‌ క్లబ్స్‌లో తాగడానికి, డ్యాన్స్‌ చేయడానికి ముందు జాతీయగీతం ప్రసారం చేయకూడదా? అని ట్విట్టర్ లో సుప్రీం తీర్పును ప్రశ్నించారు.

Follow Us:
Download App:
  • android
  • ios