Asianet News TeluguAsianet News Telugu

జయలలిత ఆస్తుల విలువ రు. 117 కోట్లట

ఈ ఏడాది డాక్టర్ రాధాకృష్ణనగర్ అసెంబ్లీ  ఎన్నికల పుడు అందించిన అఫిడవిట్ ప్రకారం జయలలిత అస్తుల విలువ రు. 117 కోట్లు.

value of Jayalalitha assets

డాక్టర్ రాధాకృష్ణనగర్ ఉప ఎన్నికల  సందర్బంగా 2016 ఎప్రిల్ 23న ఎన్నికల కమిషన్ కు సమర్పించిన అఫిడవిట్ ప్రకారం జయలలిత   ఆస్తుల విలువ  రూ.117.13 కోట్ల.

 

ఇందులో  పోయెస్ గార్డెన్ వేదనిలయం లోని 24వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న రూ.43.96 కోట్ల జయలలిత నివాస గృహం కూడా ఉంది. దీనిని  జయలలిత తల్లి సంధ్య 1967లో రూ.1.32 లక్షలకు కొనుగోలు చేశారు.

 

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా జీడిమెట్ల గ్రామంలో 14.50 ఎకరాలు, తమిళనాడులో కంచీపురంలో 3.43 ఎకరాలు వ్యవసాయ భూమి ఉందని అమె పేర్కొన్నారు.  హైదరాబాద్ సమీపంలో ఉన్న  ఈ ఆస్తిని తల్లి సంధ్యతో కలిసి 1968లో కొనుగోలు చేశారు. కాంచీపురం చెయూర్లో ఉన్న భూమిని  1981లో కొనుగోలు చేశారు. జయలలితకు మొత్తం నాలుగు వాణిజ్య భవన సముదాయాలున్నాయి. ఇందులో ఒకటి హైదరాబాద్లో ఉంది.

 

అఫిడవిట్ సబ్ మిట్ చేసే నాటికి ఆమె దగ్గర చేతిలో ఉన్న నగదు కేవలం రు. 41,000. బ్యాంకు డిపాజిట్లు రు. 10,63,83, 945.51.

 

ఇతర ఇన్వెస్ట్ మెంట్లకు సంబంధించి జయ పబ్లికేషన్స్ లో రు. 21, 50,54,080.00,  శశి ఎంటర్ ప్రైజెస్ లో రు. 20,12, 570.00, కోదండ్ ఎస్టేట్ లో రు. 3,13,20,633.00,  రాయల్ వాలీ ఫోరిటెక్ ఎక్స్ పోర్ట్స్ లో రు. 40,41,096.00 , గ్రీన్ టీ ఎస్టేట్స్ లో రు. 27,44,55,450.00   ఉన్నాయి.

 

ఇక కార్లకు సంబంధించి రెండు టయోటా ప్రాడో ఎస్‑యూవీలు (2010), టెంపో ట్రావెలర్(2000), టెంపో ట్రాక్స్(1989), మహింద్రా జీప్(2001), తయారు అంబాసిడర్ కారు(1980ల), మహింద్రా బోలెరో(2000), స్వరాజ్ మ్యాక్సీ(1988), మోడల్ కాంటెస్సా(1990)‑ జయలలిత దగ్గరుండేవి. ఈ మొత్తం తొమ్మిది వాహనాలవిలువ రూ.42,25,000లుగా అఫిడవిట్ లో చూపారు. నగల వివరాలు -

 

21280.300 గ్రాముల బరువు గల బంగారు ఆభరణాలు ఉన్నాయి.   వాటిని అక్రమాస్తుల కేసుల్లో  ఉన్నందున ఇవి ప్రస్తుతం కర్నాటక ప్రభుత్వ ట్రెజరీలో ఉన్నాయని ఆమె ఆఫిడవిట్ లో పేర్కొన్నారు. అదేవిధంగా రూ.3,12,50,000 విలువ కలిగిన 1,250 కేజీల వెండి కూడా ఉంది. 

 

చరాస్తులవిలువ రూ.41.63 కోట్లు స్థిరాస్తులు రూ.72.09 కోట్లు అని అమె ప్రకటించారు.

మిగతా వివరాలు ఇక్కడ ఉన్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios