లవర్స్ డే రోజు ప్రేమికులు ఏం చేస్తున్నారో తెలుసా..? తాజా సర్వేలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. కేవలం ప్రేమికుల దినోత్సవం రోజునే చాలా మంది సెక్స్ లో పాల్గొంటున్నారట. బ్రిటన్ లోని నేషనల్ హెల్త్ సర్వీస్ చేసిన తాజా సర్వేలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. వారి సర్వే ప్రకారం.. కేవలం వాలంటైన్ వారంలోనే ఎక్కువ మంది సెక్స్ లో పాల్గొంటున్నారు. దీని కారణంగా.. చాలా మంది గర్భం దాలుస్తున్నారని తేలింది.

2015వ సంవత్సరం నుంచి వారు ఈ సర్వే చేసినట్లు తెలిపారు. పిల్లలు పుడుతున్న నెలలు, తేదీలను బట్టి దీని నిర్ధారణకు వచ్చినట్లు వారు చెప్పారు. ప్రేమికుల దినోత్సవ వారంలో 16,263 మంది గర్భందాలుస్తున్నట్లు గుర్తించారు. ఆ మరుసటి వారమూ 16,344 మంది కడుపు పండుతున్నట్లు గమనించారు.  ఒక వారంలో మహిళలు ప్రపంచవ్యాప్తంగా 15,427 మంది గర్భందాలుస్తుండగా..వాలంటైన్ వీక్ లో మాత్రం 5శాతం అదనంగా గర్భవతులు అవుతున్నట్లు తేలింది.  దాదాపు క్రిస్మస్‌ వారంలో మహిళలు ఎక్కువగా గర్భందాలుస్తుంటారని అయితే.. ఆ తర్వాతి స్థానంలో ప్రేమికుల వారం ఉందని పరిశోధకులు శారా జేన్‌ మార్ష్‌ తెలిపారు.