ఇక హైదరాబాద్ వాసులు మెగాస్టార్ చిరంజీవి ఫిల్టర్ కాఫీని రుచి చూడవచ్చు. మొన్నామధ్య.. ‘చిరు దోశ’ కి ఆయన కుమారుడు రామ్ చరణ్ పేటెంట్ రైట్స్ తీసుకున్న సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇది కూడా ఇంచుమించు అలాంటిదే. దోశ కుమారుడి గిఫ్ట్ అయితే.. ఈ ఫిల్టర్ కాఫీ కోడలు గిఫ్ట్ అనమాట.

అసలు విషయానికి వస్తే.. మెగాస్టార్ కోడలు( రామ్ చరణ్ భార్య) ఉపాసన.. అపోలో ఫౌండేషన్ కి వైస్ ఛైర్ పర్సన్ అన్న విషయం తెలిసిందే. కాగా.. ఆ అపోలో హాస్పిటల్స్ లోనే ఈ చిరు ఫిల్టర్ కాఫీని అందించబోతున్నారు. ఈ రోజు మధ్యాహ్నం నుంచి ఈ చిరు ఫిల్టర్ కాఫీ నగర వాసులు ఆస్వాధించవచ్చు. హైటెక్ సిటీలోని అపోలో ఫౌండేషన్ థియేటర్ సమీపంలో ప్రత్యేకంగా ఒక కేఫ్ ఏర్పాటు చేశారు. శుక్రవారం మధ్యాహ్నం 2గంటలకు ఓపెన్ చేయనున్నట్లు ఉపాసన తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.

 

ఆ కేఫ్ లో రూ.20లకే చిరు ఫిల్టర్ కాఫీ, రూ.20కి హైదరాబాదీ కేసర్ రోజ్ టీ, రూ.30కే లుఖ్మీ చికెన్/వెజ్, రూ.30కి లమకాన్స్ వరల్డ్ ఫేమస్ సమోసా, రూ.30కి మిర్చి బజ్జీ అందించనున్నట్లు ఉపాసన తెలిపారు.