నాలుగు వేల అడుగుల కలామ్ ఫోటో ఆవిష్కరణ

unveiled image of kalam on his 86th  birth anniversary
Highlights

  • యువతరంగ్ అండ్ కేపీసీ ప్రైవేటు లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 4వేల చదరపు అడుగుల కలామ్ ఫోటోని ఆవిష్కరించారు.

భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం 86వ జయంతి వేడుకులను ఈ ఆదివారం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో  ఈరోజు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. యువతరంగ్ అండ్ కేపీసీ ప్రైవేటు లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 4వేల చదరపు అడుగుల కలామ్ ఫోటోని ఆవిష్కరించారు.

టీకేఆర్ కాలేజ్ గ్రౌండ్ లో ఈ ఫోటోని ఆవిష్కరించగా.. ఈ కార్యక్రమానికి కలామ్ సెంటర్ సీఈవో శ్రీజనపాల్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తీగల కృష్ణారెడ్డి, కేపీసీ ప్రాజెక్టు మేనేజింగ్ డైరెక్టర్ అనిల్, యువతరంగ్ టీమ్ సభ్యులు హరీష్, ఫణి, అవినాష్, అన్వేష్ తదితరులు పాల్గొన్నారు.

loader