గిరిజన బాలికపై ఓ కామాంధుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన కుమురం భీం జిల్లాలోని తిర్యాని మండలంలో చోటుచేసుకుంది. బాలిక తండ్రిపై దాడి చేసి అతడి ఎదురుగానే దుండగుడు బాలికపై అత్యాచారయత్నం చేశాడు. ఈ సంఘటనపై పోలీసులు తెలిపిన వివరాలు కింది విధంగా ఉన్నాయి.  

కుమరం భీం జిల్లాలోని జెండాగూడ గ్రామానికి చెందిన ఓ గిరిజన బాలిక తండ్రితో కలిసి పశువులు మేపడానికి అడవికి వెళ్లింది. అయితే ఈ బాలికపై కన్నేసిన ఓ గుర్తుతెలియని దుండగుడు అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. దీంతో బాలిక తండ్రి అతడిని అడ్డుకోవడంతో అతడిపై దుండగుడు కర్రతో దాడి చేశాడు. దీంతో తండ్రి  స్పృహా కోల్పోయాడు. కొద్ది క్షణాల్లోనే మళ్లీ స్పృహాలోకి రాగా ఆ దుండగుడు అమ్మాయి అరవకుండా నోట్లో గుడ్డలుకుక్కి బలవంతంగా లాక్కెలుతుండడాన్ని చూశాడు. దీంతో  ఆ దుండగుడిపై కర్రతో దాడి చేసి కూతురిని కాపాడాడు. ఈ దాడిలో గాయపడిన కామాంధుడు యువతిని వదిలేసి పారిపోయాడు.  
 
ఈ ఘటనపై బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తిర్యాణి ఎస్సై రాజమౌళిగౌడ్‌ తెలిపారు. యువతిపై అత్యాచారానికి పాల్పడిన దుండగుడి కోసం గాలింపు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు.