భార్య భర్తలు, లవర్స్.. అన్నాక.. చిన్న చిన్న గొడవలు రావడం సహజం.  ఆ గొడవ జరగడానికి కారణం మీరే అనుకోండి..గొడవ జరిగిన తర్వాత కొంత సమయానికి వెళ్లి మీరే సారీ చెప్పేయండి. మీరు చెప్పిన సారీని వాళ్లు యాక్సెప్ట్ చేస్తే..సరి. ఒకవేళ చేయలేదునుకోండి.. మీరు ఏమీ బాధపడనక్కర్లేదు. మాములుగా కాకుండా కాస్త యునిక్ గా సారీ చెప్పడానికి ప్రయత్నిస్తే చాలు.. ఇలా కనుక సారీ చెపితే.. ఎవరి కోపమైనా ఉఫ్.. అని ఎగిరిపోతుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం..

1.మీ కారణంగా గొడవ జరిగి.. మీ పార్టనర్ మీ మీద కోపంగా ఉన్నాడనుకోండి. మీ పార్టనర్ కి నచ్చిన ప్రదేశానికి తీసుకు వెళ్లి అక్కడ సారీ చెప్పండి. మీ మీద ఉన్న కోపం చిటికెలో ఎగిరిపోతుంది.

2. వారికి నచ్చిన ప్రదేశానికి తీసుకువెళ్లడం కుదరలేదు అనుకోండి.. మీరు ఇది ట్రై చేయవచ్చు. ఇంట్లోని కుదిరిన ప్లేస్ లో మీ నచ్చిన విధంగా సారీ లెటర్స్ పెట్టండి. వారి కబోర్డ్ లో, టేబుల్ దగ్గర, వాటర్ బాటిల్ మీద.. ఇలా వివిధ ప్లేసుల్లో పెట్టండి. ఇలా చేయడం వల్ల వారి కోపం పోవడం మాత్రమే కాదు.. మీకు వారిపై ఉన్న ప్రేమను కూడా పెంచుతుంది.

3. పై రెండు విధాల్లో సారీ చెప్పినా.. ఇంకా కోపం పోలేదనుకోండి. ఇది ప్రయత్నించండి. వారి సెల్ ఫోన్, డెస్క్ టాప్, ల్యాప్ టాప్ ల స్క్రీన్ సేవర్ మీద క్షమాపణ కోరుతూ కొటేషన్స్ పెట్టండి. లేదా వారి కోపం పొగొడతాయి అనుకునే ఫోటో పెట్టండి.

4. ఇది ఇంకో ప్రయత్నం.. సెల్ఫీలు దిగి పంపించండి. అది రెగ్యులర్ గా కాకుండా.. మీరు   బాధగా ఉన్నట్టు.. లేదా ఫోటో షాప్ తో మీ ఫోటోలను ఫన్నీ గా చేసి పంపించండి. వాటిని చూస్తే వారికి వెంటనే నవ్వు వచ్చి.. మీ మీద కోపం పోతుంది.

5. చివరి ప్రయత్నంగా ఇది ట్రై చేయవచ్చు. గట్టిగా పట్టుకొని.. ఎక్కడికి కదలనివ్వకండి. తర్వాత  క్షమించాను అని చెప్పేవరకు ఊపిరాడనివ్వకుండా ముద్దులు పెట్టండి. వారికి తప్పించుకునేందుకు ఆస్కారం ఇవ్వకూడదు. అంతే.. వారికి మీ మీద ఉన్న కోపం ఎగిరిపోతుంది.