వచ్చేది హ్యాపీ న్యూ ఇయరా, అన్ హ్యాపీ న్యూఇయరా?


అనుమానమే!


 ఈ చిల్లర డెఫిషియన్సీ జబ్బుతో,
బ్యాంకుల కాడ, ఎటిఎం ల కాడ పెరుగుతున్న క్యూలతో
జనమంతా అల్లల్లాడుతున్నపుడొచ్చేది హ్యపీ న్యూఇయర్ ఎలా అవుతుంది?



ఈ సారి ‘కుర్రకారు హ్యాపీ న్యూ ఇయర్’ సంబరాలకు చిల్లర జబ్బుసోక నుంది.
డిసెంబర్ 31 అర్థరాత్రి కొత్త సంవత్సరం కేరింతలను అదుపుచేసుకోవల్సిందే. జేబులో మిగిలిని చిల్లర పారిపోకుండా కళ్లెం వేసి బిగించాల్సిన సమయంలో న్యూఇయర్ వస్తావుంది.

హ్యాపీ న్యూ ఇయర్ అనేది సింపుల్ గా మూడు ముక్కల అరిగిపోయిన రికార్డు కాదు.
హ్యాపీ న్యూఇయర్ ఒక పండగ, పెద్ద సంబంరంగా మారింది.

ఏడాది కొకసారి వినిపించే ఈ మాట కొత్త వాళ్లని, పాత వాళ్లని మాటవరసయినా కలిపే మంచిమాట.
 అఫీసుల్లో ఇరుక్కు పోయి, పనుల్లో కూరుకుపోయి,ఏడాది పొడవునా, అందరిని మర్చిపోయిన మనం, పాత, కొత్త ,కులం , మతం , ప్రాంతం కొద్ది సేపయిన మర్చిపోయేలా చేసి, అందరిని కలిపే నడిరాతిరి పాట ‘హ్యాపీ న్యూఇయర్’

 ఈ చిన్న మాట సొంత ఇరుకు కూపం నుంచి మనల్ని బయటేస్తుంది. బజార్లోకి, జనంలోకి తీసుకువెళ్లుంది. వూరంతా తిప్పి మనం ఇంకా బతికున్నామని నిరూపించుకునే అవకాశం కల్పిస్తుంది.


సంబరాలేవయిన సరే చేతుల్ని కలిపే ముచ్చట్లే


ఈ సారి ఈ అర్థరాత్రి హ్యాపీన్యూ ఇయర్ బిగ్గరగా వినిపించక పోవచ్చు. అయితే, అదే సమయంలో, జీవితాలు ఛిన్నా భిన్నమయిన అసంతృపి అంతకంటే బిగ్గరగా వినిపించవచ్చు.
హ్యాపీ న్యూఇయర్ మాట వినిపించినపుడుల్లా, ‘ ఏం హ్యాపీ న్యూ ఇయర్ , మోదీ దెబ్బ నుంచి కోలుకోలేక పోతున్నాం,’ అనే నిట్టూర్పు కూడా వినపడేలా ఉంది దేశమంతా . 


ఎందుకంటే...


మరొక 50 రోజుల ఈ త్యాగాలు కొనసాగాల్సిన అవసరముంది అని ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా దేశ ప్రజలను కోరారు.
 50 రోజుల గడువు తర్వాత సాధారణ పరిస్థితులొస్తాయని, బ్యాంకు నిండా, ఎటిఎం లనిండా నోట్ల కట్టలుంటాయని ఆయన భరోసా ఇస్తున్నారు. 


‘నోట్ల రద్దు వల్ల దళితులు, ఆదివాసీలు, రైతులు, తల్లులు, పిల్లలు, కష్టాలు ఎదుర్కొంటున్న మాట నిజమే. అయితే, అదే సమయంలో ఈ నిర్ణయం వల్ల నల్ల కుబేరులు కోలుకోలేని విధంగా దెబ్బతిన్నారు. . కష్టాలకు ఓర్చుకుని నాకు మద్దతిస్తున్నారు. మీ త్యాగాలు వృథా కానివ్వను ,’ అని ప్రధాని ఆదివారం ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో దేశభక్తి నూరిపోశారు.
ఆయన అక్కడ ఒక గృహనిర్మాణ పథకాన్ని ప్రారంభించారు.. అనంతరం బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు.


 ‘నోట్ల కష్టాలు తీరేందుకు చాలా రోజులు పడుతుందని మొదటి రోజే చెప్పా. మీకు కష్టాలు, నష్టాలు కూడా రావచ్చు. ఈ అగ్నిపరీక్ష నుంచి దేశం విజయవంతంగా బయటపడుతుంది. ఆ విశ్వాసం నాకు ఉంది,’ ’ అన్నారు.


ఆయన ఇంకా ఏమన్నారో, హ్యాపీ న్యూఇయర్ సంబరాల జనరేషన్ మొత్తం వినాలి.


 ‘ప్రతి మూడు రోజులకు ఒకసారి పరిస్థితిన సమీక్షిస్తున్నా. యువత భవిష్యత్తును కాపాడటానికే తప్ప ఎవర్నీ ఇబ్బంది పెట్టడానికి ఈ నిర్ణయం తీసుకోలేదు’ అని చెప్పారు.
‘ నాకు తెలుసు, ఎన్ని అవస్థలు పడుతున్నా, పెద్దనోట్ల రద్దు చేయడాన్ని దేశంలోని పేదలంతా బాగా స్వాగతిస్తున్నారు. నాకు మద్దతు పలుకుతున్నారని తెలిపారు. పేదలు, మాది పేదల ప్రభుత్వం. దేశాన్ని స్వర్ణయుగం వైపు తీసుకెళ్లేందుకే ఈ కఠిన నిర్ణయం,’అని ప్రధాని చెప్పారు.