ఏపీలో నిరుద్యోగం తాండవిస్తోంది.  ఉద్యోగం కోసం సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నా.. ప్రభుత్వం మాత్రం కనికరం చూపించడం లేదు.

ఏ దేశమైనా, రాష్ట్రమైనా బాగుపడటం అనేది యువత చేతుల్లో ఉంటుంది. అలాంటి యువత.. ఉద్యోగాలు దొరకక.. రోడ్లు పట్టుకొని తిరుగుతుంటే.. ఎన్ని ప్రభుత్వాలు మారినా రాష్ట్రం, దేశం మారదు. భవిష్యత్తు అంధకారంగా ఉంటుంది. ఇదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లోనూ ఏర్పడుతోంది. యువత విద్యార్హత సాధించినప్పటికీ..ఉద్యోగార్హత మాత్రం సాధించలేకపోతున్నారు.

ఏపీలో నిరుద్యోగం తాండవిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నా.. ప్రభుత్వం మాత్రం కనికరం చూపించడం లేదు. తమకసలు ఉద్యోగం వస్తుందా అని నిరుద్యోగులు డైలమాలో పడిపోతున్నారు. అయినా ప్రభుత్వం మాత్రం ఏ మాత్రం కనికరం చూపడం లేదు. టీడీపీ ప్రభుత్వం.. యూత్ పాలసీని తీసుకువస్తామని ఇచ్చిన హామీ.. హామీగానే ఉండిపోయింది తప్ప.. ఆచరణలోకి రాలేదు.

టీడీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడిచినా.. యువతకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. ఒక్క నిరుద్యోగం విషయంలోనే కాదు.. క్రీడల్లోనూ రాష్ట్రం వెనకపడిపోతోంది. క్రీడాకారులు ఉన్నప్పటికీ.. సరైన శిక్షణ ఇచ్చే నిపుణుల కొరత ఎక్కవగా ఉంది. ప్రభుత్వ విభాగాల్లో ఖాళీ గా చాలా పోస్టులు ఉన్నప్పటికీ.. వాటిని భర్తీ చేయడంలో ప్రభుత్వం జాప్యం వహిస్తోంది. దీంతో నిరుద్యోగుల సంఖ్య ఏటా పెరిగిపోతోంది.

అంతేకాదు.. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పినా.. అది ఇప్పటి వరకు అమలు చేయలేదు. దీంతో ఏపీలో యువత దిక్కుతోచన స్థితిలో ఉండిపోయింది. వీరి సమస్యపై సీపీఎం నేత మధు స్పందించారు. ఏపీలో యువతకు తీవ్ర అన్యాయం జరుగుతోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. తక్షణమే యూత్ పాలసీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. తక్షణమే కాళీగా ఉన్న పోస్టులు భర్తీ చెయ్యాలని లేదా నిరుద్యోగ భృతి ఇవ్వాలని లేకపోతే అక్టోబర్ లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామన్నారు