కాంగ్రెసు ఎమ్మెల్యేతో గాలి బేరసారాలు: ఆడియో విడుదల (చూడండి)

First Published 18, May 2018, 7:14 PM IST
Ugrappa releases Gali Janardhan Reddy audio
Highlights

ర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్పకు మద్దతు సమకూర్చే బాధ్యతను బళ్లారి బిజెపి నేత గాలి జనార్దన్ రెడ్డి, ఆయన సోదరులు, బిజెపి ఎమ్మెల్యే బి. శ్రీరాములు భుజాన వేసుకున్నట్లు తెలుస్తోంది. 

హైదరాబాద్: కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్పకు మద్దతు సమకూర్చే బాధ్యతను బళ్లారి బిజెపి నేత గాలి జనార్దన్ రెడ్డి, ఆయన సోదరులు, బిజెపి ఎమ్మెల్యే బి. శ్రీరాములు భుజాన వేసుకున్నట్లు తెలుస్తోంది. రాయచూర్ రూరల్ శాసనసభ్యుడు బసన్నతో గాలి జనార్దన్ రెడ్డి బేరసారాలు ఆడిన ఆడియోను ఉగ్రప్ప బయటపెట్టారు. 

రాజీవ్ గౌడ, శివన్న గౌడ లైఫ్ తాను సెటిల్ చేస్తానని, అలాగే యడ్యూరప్పకు మద్దతు ఇస్తే నీ లైఫ్ కూడా సెటిల్ చేస్తానని గాలి జనార్దన్ రెడ్డి బసన్నకు ఆఫర్ ఇచ్చారు. అయితే ఆ ఆఫర్ ను బసన్న తిరస్కరించారు.

"మీరంటే నాకు గౌరవం ఉంది. కానీ కాంగ్రెసుకు నమ్మకద్రోహం చేయలేను" అని బసన్న గాలి జనార్దన్ రెడ్డి చెప్పారు. రేపు శనివారం సాయంత్రం 4 గంటలకు యడ్యూరప్ప బలనిరూపణ చేసుకోవాల్సి ఉంది.  

 

 

loader